కార్తీక మాసం సందర్భంగా శివాలయంలో మహారుద్రాబిషేకం

కార్తీక మాసం సందర్భంగా శివాలయంలో మహారుద్రాబిషేకం
x
శివాలయంలో మహారుద్రాబిషేకం
Highlights

లోక కల్యాణార్థం కార్తీకమాస పర్వదినాలను పురస్కరించుకుని శనివారం తేటగుంట గ్రామంలో అతి పురాతనమైన శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవోపేతంగా మహా రుద్రాభిషేకం, శాంతి కల్యాణాన్ని నిర్వహించారు.

తుని: లోక కల్యాణార్థం కార్తీకమాస పర్వదినాలను పురస్కరించుకుని శనివారం తేటగుంట గ్రామంలో అతి పురాతనమైన శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవోపేతంగా మహా రుద్రాభిషేకం, శాంతి కల్యాణాన్ని నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ మహా దేవునికి సప్తనదీ జలాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. పేరూరు గాంధీ దంపతులు సహకారంతో, అర్చకులు ఆకెళ్ల కృష్ణమూర్తి సారథ్యంలో మహా రుద్రాభిషేకం, శాంతి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ కార్యక్రమంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీ ఉమామహేశ్వర ఆలయ ప్రాంగణం లో భారీ శివలింగం ఏర్పాటు చేసి అర్చకులు స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రుద్రాభిషేకం నిర్వహించారు. సప్త నదీజలాలు, పాలు,పండ్ల రసాలు, తేనె, బూడిద లతో మహాదేవుని అభిషేకించారు. వేలాది మంది భక్తులు మహా దేవుని దర్శించుకుని, రుద్రాభిషేకం ని కనులారా వీక్షించారు.

అనంతరం శివ పార్వతుల కళ్యాణం కమనీయంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పట్టు వస్త్రాలు ప్రత్యేక పూలతో శోభాయమానంగా అలంకరించారు. వేద మంత్రోచ్ఛారణలతో అర్చకులు వివాహ వేడుకను అట్టహాసంగా జరిపించారు. యజ్ఞోపవీత ధారణ, బెల్లం, జీలకర్ర శిరస్సున పెట్టడం,మాంగళ్య సూత్ర ధారణ, ముత్యాల తలంబ్రాలు వంటి సన్నివేశాలు వివాహ వేడుకలో ఆద్యంతం భక్తి పరిమితమయ్యాయి. వేలాది మంది భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories