టీడీపీనుంచి మాగుంట అందుకే పోటీ చెయ్యడం లేదా..?

టీడీపీనుంచి మాగుంట అందుకే పోటీ చెయ్యడం లేదా..?
x
Highlights

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓ వైపు తెలుగుదేశం పార్టీ నుంచి కీలక నేతలు జంప్ అవుతుంటే, మరోవైపు ఆ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థులుగా పోటీ...

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓ వైపు తెలుగుదేశం పార్టీ నుంచి కీలక నేతలు జంప్ అవుతుంటే, మరోవైపు ఆ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు పలువురు నేతలు విముఖత వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్‌తో పాటు కాకినాడ ఎంపీ తోట నరసింహం కూడా ఎన్నికల్లో పోటీ చేయలేమని తేల్చి చెప్పేశారు. తాజాగా ఒంగోలు మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ మాగంట శ్రీనివాసులు రెడ్డి కూడా రానున్న ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయలేనని అధినేతకు తెగేసి చెప్పారు. అంతేకాదు ఎంపీగా పోటీ చేయమని తనను బలవంతం పెట్టొద్దని అంటున్నారట.

అయితే దీనికి కారణాలు వేరే ఉన్నట్టు తెలుస్తోంది. తాను సూచించిన నేతలకు కాకుండా పశ్చిమ ప్రకాశంలో వేరే వాళ్లకు టిక్కెట్ కేటాయించారట చంద్రబాబు. దాంతో కొంతకాలంగా ఆయన అసంతృప్తితో ఉన్నారు. అంతేకాదు వైసీపీలోకి వెళ్లాలని రెండేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్న మాగుంట రెండు మూడు రోజుల్లో ఆ పార్టీలో చేరేందుకే టీడీపీ నుంచి పోటీ చేయకూడదని నిశ్చయించుకున్నారట.

Show Full Article
Print Article
Next Story
More Stories