ఏపీలో ఎన్నికల అధికారులకు మెజిస్టీరియల్ అధికారాలు

Magisterial Powers for Electoral Officers in the Andhra Pradesh
x

Representational Image

Highlights

* ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం న్యాయశాఖ * ఎన్నికల నోటిఫికేషన్ ముగిసే వరకు స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లుగా గుర్తింపు

ఏపీలో ఎన్నికల అధికారులకు మెజిస్టీరియల్ అధికారాలు ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు మెజిస్టీరియల్ అధికారాలు ఇవ్వాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వారం కిందట ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే తాజా ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ ముగిసేవరకు ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులను స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లుగా గుర్తిస్తారు. జోనల్, ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వీలెన్స్ బృందాల చీఫ్ లకు అధికారాలు వర్తిస్తాయి. కృష్ణా, నెల్లూరు, కర్నూలు, విజయనగరం, అనంతపురం, విశాఖ జిల్లా ఎన్నికల అధికారులుగా కలెక్టర్లు నోటిఫై చేసిన వారికి మెజిస్టీరియల్ అధికారాలు అప్పగిస్తూ న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories