కరోనాను సృష్టించింది చైనా కాదు..నేనే.. విస్మయానికి గురిచేసిన మదనపల్లి నిందితురాలి ప్రవర్తన

కరోనాను సృష్టించింది చైనా కాదు..నేనే..  విస్మయానికి గురిచేసిన మదనపల్లి నిందితురాలి ప్రవర్తన
x
Highlights

చిత్తూరు జిల్లా మదనపల్లెలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పురుషోత్తం నాయుడు, పద్మజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు....

చిత్తూరు జిల్లా మదనపల్లెలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పురుషోత్తం నాయుడు, పద్మజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పద్మజ పోలీసులకు చుక్కలు చూపించింది. కరోనా టెస్ట్‌ చేయించడానికి తీసుకెళ్తున్న పోలీసులకు పద్మజ సహకరించలేదు. తానే భగవంతుడిని అని కరోనా టెస్టు అవసరం లేదని వాగ్వాదానికి దిగింది.

పద్మజ పిచ్చి పీక్స్‌కి వెళ్లింది. ఆ పిచ్చిలో ఏం చేస్తున్నామో కూడా తెలియనంత డీప్‌లోకి వెళ్లింది. కరోనా టెస్టు చేయించుకునేందుకు నిరాకరించింది. శివుడు మదనపల్లెలోనే ఉన్నాడని, అందుకే కరోనా పారిపోయిందని వ్యాఖ్యలు చేసింది. మూఢభక్తిలో రెచ్చిపోయారు. నేనే శివుడ్ని,నాకు కరోనా రావడమేంటి? అని పేర్కొన్న పద్మజ. కరోనాను సృష్టించింది చైనా కాదు తానే అంటూ మరింత గందరగోళానికి గురిచేసింది.

ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం కుటుంబం అంతా అదే భ్రమలో ఉన్నారు. ఆ భ్రమలో కన్న కూతుళ్లను కూడా దారుణంగా హత్య చేశారు. పురుషోత్తంనాయుడు దంపతులను సుదీర్ఘ సమయం పాటు విచారించిన పోలీసులకు మతిపోయినంత పనైంది. దయ్యం పట్టినందునే తమ కుమార్తెలను డంబెల్స్ తో కొట్టిచంపామని, మళ్లీ వాళ్లిద్దరూ బతికి వస్తారని వెల్లడించారు. విద్యావంతుల కుటుంబం ఇలా క్షుద్రపూజలు చేయడం ఆ కాలనీని విస్మయానికి గురి చేస్తోంది.

పద్మజకు కరోనా టెస్ట్ చేయడానికి కూడా వైద్య సిబ్బంది విఫలయత్నం చేయాల్సి వచ్చింది. పద్మజ ప్రవర్తనను చూసి పోలీసులకే మైండ్ బ్లాంక్ అయింది. అయితే పిల్లలు చనిపోయారన్న పశ్చత్తాపం ఏమాత్రం కనిపించడ లేదు. తాము పూర్తి స్పృహలోనే ఉన్నామని, తమ పిల్లలు ప్రాణాలతో మళ్లీ తిరిగి వస్తారని ధీమా వ్యక్తం చేసింది. భర్త పురుషోత్తం నాయుడు మాత్రం సాధారణ స్థితికి వచ్చాడు. ఆమె సాధారణ స్థితికి వస్తేగానీ ఈ కేసులో మరిన్ని విషయాలు బయటకు వస్తాయని పోలీసులు అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories