Rain Update: బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీకీ భారీ వర్ష సూచన..తెలంగాణలో?

Rain Update: బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీకీ భారీ వర్ష సూచన..తెలంగాణలో?
x
Highlights

Imd Alerts: నేడు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఏపీలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది....

Imd Alerts: నేడు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఏపీలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. తెలంగాణలో కూడా డిసెంబర్ 17వ తేదీ నుంచి వర్షాలు పడనున్నాయి.

అల్పపీడనం ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందిని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళవారం, కోస్తా, రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్నిచోట్ల చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరికలు జారీ చేసింది. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

భారీ వర్ష సూచన నేపథ్యంలో పరివాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్జ్ జారీ చేసింది. నేడు, రేపు పొడి వాతావరణ ఉంటుందని తెలిపింది. ఆ తర్వాత తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. డిసెంబర్ 17వ తేదీ నుంచి తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. డిసెంబర్ 20వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ఎలాంటి హెచ్చరికలు లేవని తెలిపింది.

మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉదయం పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది. నేడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో శీతలగాలులు వీచే ఛాన్స్ ఉంది. ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది.


Show Full Article
Print Article
Next Story
More Stories