Rain Alert: దిశ మార్చేసిన అల్పపీడనం..నేడు ఏపీకి భారీ వర్ష సూచన

Rain Alert: దిశ మార్చేసిన అల్పపీడనం..నేడు ఏపీకి భారీ వర్ష సూచన
x
Highlights

Rain Alert: నైరుతీ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ వైపు కదలనుంది. ఆ తర్వాత శనివారం నాటికి ఏపీ తీరానికి...

Rain Alert: నైరుతీ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ వైపు కదలనుంది. ఆ తర్వాత శనివారం నాటికి ఏపీ తీరానికి చేరుకుంటుంది. దీంతో నేడు శుక్రవారం కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఏఫీ వ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాయలసీమలో కూడా నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

నేడు రెండు రాష్ట్రాల్లో రోజంతా మేఘాలు ఉంటాయి. ఏపీలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ, కోస్తాంధ్రతోపాటు ఉత్తరాంధ్రలో కూడా మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మరో 24 గంటల్లో ఉత్తరదిశగా కదులుతూ ఏపీ తీరం వెంబడి పయనిస్తుంది. దీని ప్రభావంతో విశాఖ, శ్రీకాకుళం, కాకినాడ, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

అటు నెల్లూరు చిత్తూరు, అన్నయమ్య, వైఎస్సార్, నంద్యాల, అనంతపురం, కర్నూలు, ప్రకాశం, కోనసీమ, ఉభయగోదావరి, క్రిష్ణ జిల్లాల్లో తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories