నెల్లూరు జిల్లాలో ప్రేమజంట అలజడి

Lover Suicide Attempt in Nellore District
x

Representational Image

Highlights

* కన్నవారి నుంచి ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించిన జంట * పట్టించుకోని పోలీసులు.. * ఆత్మహత్యకు ప్రయత్నించిన ప్రేమజంట

నెల్లూరు జిల్లాలో ఓ ప్రేమ జంట అలజడి సృష్టించింది. కన్నవారి నుంచి తమకు ప్రాణహాని ఉందని కాపాడండి అంటూ పోలీసులను ఆశ్రయించారు. అయితే.. పోలీసుల నుంచి ఆశించిన భరోసా రాకపోవడంతో ఆ ప్రేమజంట ఆత్మహత్యకు ప్రయత్నించారు. స్థానికుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.

రాజమండ్రికి చెందిన అమృత, నెల్లూరుకు చెందిన రిషిసింగ్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. విజయవాడలో కలిసి చదువుకునే రోజుల్లో ప్రేమలో పడ్డారు. అయితే వీరి ప్రేమను ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. అంతేకాదు అమృత తండ్రి గంగాధర్ అమ్మాయిని చంపేందుకు ప్రయత్నించాడు. దాంతో తమను కాపాడండంటూ గుడూరు పోలీసులను ఆశ్రయించారు. అయితే. అక్కడ వారికి సరైనా భరోసా రాకపోవడంతో కలిసి బతకలేనప్పుడు.. కలిసి చనిపోవాలనుకున్నారు. అంతే సూసైడ్ కు ప్రయత్నించారు.. స్థానికులు సరైన సమయంలో స్పందించడంతో ఇద్దరు బతికారు.

Show Full Article
Print Article
Next Story
More Stories