కర్నూలు జిల్లాలో వివాదంగా మారిన ప్రేమ వివాహం

కర్నూలు జిల్లాలో వివాదంగా మారిన ప్రేమ వివాహం
x
Highlights

* ఆస్పరి (మం) లో ప్రేమ వివాహం చేసుకున్న మేజర్ జంట * SC యువకుడిని వివాహమాడిన BC యువతి * పెళ్లికి నిరాకరించిన యువతి తల్లిదండ్రులు

ప్రేమ వివాహం ఇష్టం లేని కన్న తల్లిదండ్రులు కక్ష సాధింపునకు దిగుతున్నారని ఆరోపిస్తోంది ఓ కూతురు. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు తమ కులాలు అడ్డు రావటంతో ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది. కూతురు కనిపించకపోయేసరికి కంగారుపడిన తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐతే, ప్రేమజంట తమ అభిప్రాయాన్ని సెల్ఫీ రూపంలో పోలీసుల ముందు ఉంచారు. కులాంతర వివాహం తమ తల్లిదండ్రులకు అంగీకారం కాకపోవడంతోనే తాము దూరంగా పోయి పెళ్లి చేసుకోవలసి వచ్చిందని స్పష్టం చేశారు.

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కారుమంచి గ్రామంలో BC వర్గానికి చెందిన ఓ మేజర్ యువతి అదే మండలంలోనే కైరుప్పల గ్రామానికి చెందిన SC యువకుడితో నాలుగు నెలల క్రితం ఇళ్ళు వదలి వెళ్ళింది. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు మేజర్లని వారు హైదరాబాద్ ఆర్య సమాజంలో పెళ్లి చేసుకోని అక్కడే నివాసం ఉంటున్నారని విచారణ చేసి తల్లితండ్రులకు విషయం తెలిపారు. యువతి తల్లిదండ్రులు వారు ఎక్కడ ఉన్నారో తమకు ఆధారాలతో చూపాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఇంతవరకు వారి ఆచూకీని యువతి తల్లిదండ్రులకు చూపక పోవడంతో వారు పలు అనుమానాలు వ్యక్తం చేసారు. యువకుడి ఇంటిపై దాడి చేసి సామాగ్రిని ధ్వంసం చేసారు.

సంచలనం రేపుతున్న కారుమంచి ప్రేమ వివాహం గురించి ఇపుడు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. తాను తన భర్త క్షేమంగా ఉన్నామని, తమను ఎవరు వెతకాల్సిన అవసరం లేదని అలా ఎవరైనా ప్రయత్నించిన వారు తమ వద్ద లంచం తీసుకున్నట్లు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడతామని సెల్పి వీడియోలో హెచ్చరించారు. ఏది ఏమైనప్పటికీ తాజా వివాదంతో గ్రామంలో గొడవలు, ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు నిఘా పెట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories