ఆదిత్యలో స్పెయిన్ కు చెందిన "లోసు ఇబార్బియా" గెస్ట్ లెక్చర్

ఆదిత్యలో స్పెయిన్ కు చెందిన లోసు ఇబార్బియా గెస్ట్ లెక్చర్
x
లోసు ఇబార్బియా, ప్రిన్సిపాల్ డా. టి.కె.రామకృష్ణారావు, వైస్ ప్రిన్సిపాల్ డా.వి.శ్రీనివాసరావు, డా. ఎం. ఎస్. సి. సోపియా
Highlights

గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన తృతీయ సంవత్సరం చదువుచున్న మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు స్పెయిన్ దేశానికీ చెందిన "లోసు ఇబార్బియా" చే ఒకరోజు కార్యశాల నిర్వహించారు.

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన తృతీయ సంవత్సరం చదువుచున్న మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు స్పెయిన్ దేశానికీ చెందిన కార్పొరేట్ డైరెక్టర్ ఆఫ్ బిజినెస్ డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీ "లోసు ఇబార్బియా" చే ఒకరోజు కార్యశాల నిర్వహించారు. ఈ సందర్బంగా ఇబార్బియా మాట్లాడుతూ విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై ద్రుష్టి సారించాలని ప్రప్రంచ దేశాలలో వేగంగా మారుతున్న సృజనాత్మక అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, నేటి పోటీ ప్రపంచంలో నిరంతరం చెందుతున్న అభివృద్ధిని అందిపుచ్చుకొని మరింత మెరుగుగా మన ఆలోచన విధానం ఉండాలని అన్నారు.

ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ స్పెయిన్ దేశానికీ చెందిన మిస్టర్ లోసు ఇబార్బియా తన సహచర ఐ.ఐ.ఎం కలకత్తా విద్యార్థి అని తన స్నేహ బంధానికి విలువనిచ్చి నేడు తమ సంస్థలను సందర్శించడానికి రావడం ఆనందదాయకం అని చెపుతూ విద్యార్థులు తమని తాము తక్కువ చేసుకోవడం వల్ల నూన్యతాభావం వల్ల ముందుకు సాగలేకపోతున్నారని మన కళాశాలలో నేడు అత్యుత్తమ వార్షిక వేతనంతో ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలను పొందినవారు సాధారణ కుటుంబం నుండి కేవలం ఫీజు రియంబర్స్ మెంట్ తో చదివినవారు ఉన్నారని కావున మనం వారికన్నా తక్కువ, నాకు అంత అర్హత లేదు, అనే భావన విడనాడాలని హితవు పలికారు.

ఈ కార్యక్రమంలో ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్& టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపాల్ డా. టి.కె.రామకృష్ణారావు, వైస్ ప్రిన్సిపాల్ డా.వి.శ్రీనివాసరావు, సాంస్కృతిక విభాగం కో.ఆర్డినేటర్ డా. ఎం. ఎస్. సి. సోపియా, మెకానికల్ విభాగం అధిపతులు విద్యార్థులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories