వేంపల్లి మీసేవ కేంద్రాలలో నిలువు దోపిడీ

వేంపల్లి మీసేవ కేంద్రాలలో నిలువు దోపిడీ
x
mee seva
Highlights

వేంపల్లె మీ- సేవ కేంద్రాల్లో నిర్వాహకులు అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రజలు, రైతులు వాపోతున్నారు.

వేంపల్లి: వేంపల్లె మీ- సేవ కేంద్రాల్లో నిర్వాహకులు అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రజలు, రైతులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటివల పలు పథకాలను ప్రవేశపెట్టింది. దీంతో ఆయా సర్టిఫికెట్లు పొందేందుకు మీసేవా కేంద్రాల వద్దకు పరుగులు తీస్తున్నారు. దీంతో మీసేవా కేంద్రాల వద్ద రద్దీ ఎక్కువగా పెరిగింది. వేంపల్లెలో 5 మీసేవా కేంద్రాలు ఉన్నాయి.

ఇతర పనులు విడిచిపెట్టి సర్టిఫికెట్లు కోసం మీసేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. లేబర్ సర్టిఫికెట్లుకు 90 రూపాయలు తీసుకొవాల్సి వుండగా దాదాపు 200 వందల నుండి 300 వందల రూపాయలు వరకు తీసుకొంటున్నారని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వం ఒక వైపు అవినీతిని నిర్మూలించాలని చెబుతుంటే, పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లెలోని మీసేవా కేంద్రాల్లో ప్రజల నుండి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని వాపోతున్నారు.

అయితే తహసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మీ-సేవా కేంద్రాల్లో నిర్ణీత రేట్లు కంటే అధికంగా డబ్బులు వసూలు చేస్తే అలాంటి మీ సేవా నిర్వహకులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల నుండి ఫిర్యాదు వస్తున్నాయని కాబట్టి మీసేవా కేంద్రాలను తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని నిర్వాహకులు అధికంగా డబ్బులు వసూలు చేస్తే అలాంటి మీసేవా నిర్వాహకులపై ఉన్నతాధికారులకు సిపారసు చేస్తామని హెచ్చరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories