టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఇళ్లలోనే జరుపుకోవాలి : చంద్రబాబు

టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఇళ్లలోనే జరుపుకోవాలి : చంద్రబాబు
x
Chandrababu Naidu , Lokesh
Highlights

టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, అభిమానుల ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్‌ శుభాకాంక్షలు తెలిపారు.

టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, అభిమానుల ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్‌ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా లోకేష్ ట్వీట్ చేశారు.'దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్న పార్టీ మూల సిద్ధాంతాన్ని విడిచిపెట్టకుండా... 38 ఏళ్ళుగా ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసమే ప్రతి అడుగూ వేస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీలో నేనూ ఒకడిని కావడం నాకు గర్వకారణం' అని పేర్కొన్నారు.

తెలుగువారి ఆత్మగౌరవ సంకేతంగా ఎన్టీఆర్ గారిచే స్థాపించబడి, చంద్రబాబుగారి దార్శనికతలో తెలుగువారి అభివృద్ధి నినాదమై నిలచిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, నేతలకు, అభిమానులకు శుభాకాంక్షలు అంటూ మరో ట్వీట్ లో లోకేష్ పేర్కొన్నారు.

మరోవైపు చంద్రబాబు కూడా కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. వరదలు, హుద్‌ హుద్‌, తిత్లీ తుఫానులు వంటి ఎన్నో విపత్తుల్లో ప్రజలకు అండగా టీడీపీ అండగా నిలిచిందని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో కరోనా విపత్తులోనూ ప్రజలకు అండగా నిలవాలని తెలుగుదేశం కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌ ఆశయ సాధనకు పునరంకితం కావాలని చంద్రబాబు కోరారు. ఇదే రోజున 1982లో తెలుగుదేశం ఆవిర్భవించిందన్న చంద్రబాబు, బీసీ, ఎస్సీ,ఎస్టీ మైనార్టీ వర్గాలను రాజ్యాధికారంలో భాగస్వామ్యులను చేసిందని చంద్రబాబు అన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఇళ్లలోనే జరుపుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories