మంగళగిరి నుంచి పోటీ చేయడానికి సిద్దమైన మంత్రి లోకేష్

మంగళగిరి నుంచి పోటీ చేయడానికి సిద్దమైన మంత్రి లోకేష్
x
Highlights

వచ్చే ఎన్నికల్లో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పోటీ చేసే నియోజకవర్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల్లో పోటీకి నారా...

వచ్చే ఎన్నికల్లో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పోటీ చేసే నియోజకవర్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల్లో పోటీకి నారా లోకేశ్‌ సై అనడంతో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారోనని టీడీపీలో ఉత్కంఠ సాగుతోంది. తండ్రి చంద్రబాబు, మామ బాలకృష్ణ మాదిరిగా రాయలసీమ నుంచే బరిలోకి దిగుతారా? లేద కోస్తాను పోటీకి లోకేశ్ ఎంచుకుంటారా? అనేదానిపై తీవ్ర చర్చ జరిగింది. ఈ క్రమంలో భీమిలి, విశాఖ నార్త్ నియోజకవర్గాలు ప్రముఖంగా వినిపించినా వాటిపై పెద్దగా ఆసక్తి కనబరచలేదు యువనేత. దీంతో ఆయన పోటీ చేసే నియోజకవర్గాన్ని ఆయనే ఎంచుకున్నారు.

ఈ ఎన్నికల్లో మంగళగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చెయ్యాలని ఆయన భావిస్తున్నారు. దీనిపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన నేతలు లోకేష్‌ కు మంగళగిరి టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లిలోనే చంద్రబాబు నివాసం ఉంది. మంగళగిరి నుంచి లోకేష్‌ను పోటీకి దింపితే ఈ ప్రభావం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉంటుందని భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories