అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై లోకాయుక్త విచారణ

అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై లోకాయుక్త విచారణ
x
Highlights

హైపవర్ కమిటీ నివేదికకు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లు, అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణపై హైపవర్ కమిటీ ఇచ్చిన...

హైపవర్ కమిటీ నివేదికకు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లు, అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణపై హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికలకు ఆమోదం తెలిపింది. మరోవైపు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై లోకాయుక్త విచారణ జరపాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమరావతి రాజధాని పరిధిలో 4 వేల 69 ఎకరాలు ఎవరెవరు కొన్నారో కేబినెట్ సబ్ కమిటీ నివేదికలో పేర్కొంది. ఈ సబ్ కమిటీ నివేదికలో పలువురు టీడీపీ నేతల పేర్లు ఉన్నట్టు బయటపెట్టింది. అమరావతిలో రాజధాని ప్రకటనకు ముందే టీడీపీ నేతలు, వారి బినామీలు పెద్ద ఎత్తున భూములను కొనుగోళ్లు చేశారని ఏపీ మంత్రులు ఆరోపించారు.

ఎవరెవరు ఎన్ని ఎకరాల భూములు కొనుగోలు చేశారనే దానిపై కూడా అసెంబ్లీలో పేర్లు వెల్లడించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన వారిలో ముఖ్యమైన వారి పేరుతో ఆరుగురి పేర్లను కేబినెట్ సబ్ కమిటీ పొందుపరించింది. అందులో మాజీ సీఎం చంద్రబాబునాయుడు, లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడైన వేమూరు రవికుమార్, మాజీ మంత్రి నారాయణ, పరిటాల సునీత, జీవీఎస్ ఆంజనేయులు, లింగమనేని రమేష్, పయ్యావుల కేశవ్ పేర్లను ప్రముఖంగా ప్రస్తావించింది. బీజేపీ నేత లంకా దినకర్, దూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన్‌రావు, పుట్టా మహేష్ యాదవ్ పేర్లను కూడా బయటపెట్టింది. వీరితోపాటు కొమ్మాలపాటి శ్రీధర్, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్ బాబు, నారా లోకేష్, కోడెల శివప్రసాదరావు పేర్లను కూడా అందులో పేర్కొంది.

లింగమనేని రమేష్‌, సుజనా చౌదరి లు భారీగా భూములు కొన్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనిపై కొన్ని ఆధారాలను కూడా బయటపెట్టింది. కాగా మొత్తం ఏడు బిల్లులను ఈరోజు మంత్రివర్గం ఆమోదించింది.. 11 వేలకుపైగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాజధాని రైతులకు మెరుగైన మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించింది. అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు కౌలు 10 నుంచి 15 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపిన క్యాబినెట్.. అమరావతిలోనే మూడు అసెంబ్లీ సెషన్స్ నిర్వహించాలని నిర్ణయించింది. పులివెందుల అర్బన్ డెవలప్‌ మెంట్ అథారిటీకి కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories