LockDown In Tirupati: నేటి నుంచి తిరుపతి లాక్ డౌన్.. ఏర్పాట్లు చేసుకుంటున్న పోలీసు యంత్రాంగం

LockDown In Tirupati: నేటి నుంచి తిరుపతి లాక్ డౌన్.. ఏర్పాట్లు చేసుకుంటున్న పోలీసు యంత్రాంగం
x
lockdown
Highlights

LockDown In Tirupati: రాష్ట్రం మొత్తం కోవిద్ కేసులతో అల్లాడిపోతోంది. ఎక్కడ చూసినా కరోనా కేసులే.

LockDown In Tirupati: రాష్ట్రం మొత్తం కోవిద్ కేసులతో అల్లాడిపోతోంది. ఎక్కడ చూసినా కరోనా కేసులే. దీనిని కట్టడి చేయాలంటే ఏకైక మార్గం లాక్ డౌన్ గానే ప్రజలు గుర్తించారు. దీనిని వ్యాపార వర్గాలు సైతం తన మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈ విధంగా ప్రతి చోట స్థానికంగా ఉండే అధికారుల సమక్షంలో అందరూ కలిసి లాక్ డౌన్ విధించుకునేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఈ లాక్ డౌన్ కొన్ని చోట్ల ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు, మరికొన్ని చోట్ల ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు షాపులు తెరిచి ఉంచేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక ఆ తరువాత ప్రజలెవ్వరైనా అత్యవసర పనులకు తప్ప రోడ్డు మీదకు రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇది కేసుల తీవ్రతను బట్టి ప్రతి జిల్లాలోనూ నేటి నుంచి కొనసాగుతోంది. విజయనగరం జిల్లాలో సాక్షాత్తూ లాక్ డౌన్ తప్పదన్నట్టు మంత్రి బొత్సా స్వయంగా ప్రకటించారు. ఈ విధంగా రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఉండటంతో మరలా లాక్ డౌన్ ను పున: ప్రారంభిస్తున్నారు. తాజాగా నేటి నుంచి తిరుపతిలో ఇదే విధానంలో లాక్ డౌన్ ప్రకటించారు. దీనిని అందరూ తప్పనిసరిగా పాటించాలని పోలీసులు ఆదేశాలు జారీచేశారు.

క‌రోనా కేసులు అధిక‌మ‌వుతున్న నేప‌థ్యంలో తిరుప‌తిలో రేప‌టినుంచి సంపూర్ణ ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు కలెక్ట‌ర్ నారాయణ భరత్ గుప్తా సోమవారం ప్ర‌క‌టించారు. అత్య‌వ‌స‌ర సేవ‌లు, మెడిక‌ల్ షాపులు మిన‌హా మిగ‌తా దుకాణాల‌కు ఉద‌యం 6 గంట‌ల నుంచి 11 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంద‌ని తెలిపారు. ఈ స‌మ‌యం దాటాకా వాహ‌నాల‌కు కూడా అనుమ‌తి ఉండ‌ద‌ని పేర్కొన్నారు. ఈ ఆంక్ష‌లు వ‌చ్చే నెల 5 వ‌ర‌కు కొన‌సాగుతాయ‌ని తెలిపారు. జిల్లాలో క‌రోనా వైరస్‌ తీవ్ర‌త అధిక‌మ‌వుతున్నందున ప్ర‌తి ఒక్క‌రూ నిబంధ‌న‌లు పాటించాల‌ని కోరారు.

జిల్లా వ్యాప్తంగా క‌రోనా కేసులు అధిక‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు చిత్తూరులో 5400 క‌రోనా కేసులు న‌మోదుకాగా, వీటిలో అత్య‌ధికంగా తిరుప‌తిలోనే 1700 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఆంక్ష‌ల‌ను క‌ఠిన‌త‌రం చేస్తూ జిల్లా కలెక్ట‌ర్ నారాయ‌ణ భ‌ర‌త్ గుప్తా ఉత్త‌ర్వులు జారీ చేశారు. ప్ర‌తీ ఒక్క‌రూ విధిగా నిబంధ‌న‌లను పాటించి స‌హ‌క‌రించాల‌ని ఎస్పీ రమేష్ రెడ్డి కోరారు. పోలీసు శాఖ‌లోనూ క‌రోనా కేసులు పెరుగుతున్నాయ‌ని, ఇప్ప‌టికే ఇద్ద‌రు పోలీసులు క‌రోనా కారణంగా మ‌ర‌ణించార‌ని పేర్కొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories