విజయవాడలో ప్రారంభమైన రైళ్లు..

విజయవాడలో ప్రారంభమైన రైళ్లు..
x
Highlights

లాక్ డౌన్ 5.0 సడలింపుల్లో భాగంగా విజయవాడలో రైళ్లు ప్రారంభమయ్యాయి.

లాక్ డౌన్ 5.0 సడలింపుల్లో భాగంగా విజయవాడలో రైళ్లు ప్రారంభమయ్యాయి. స్టేషన్ వద్ద ప్రయాణికులు బారులు తీరారు. దాదాపు రెండున్నర నెలల తర్వాత ప్రయాణికులతో కళకళలాడుతూన్నాయి. నేటి నుంచి రైళ్లు మళ్లీ ప్రారంభం కావడంతో పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్ కు చేరుకుంటున్నారు.

రైలు బయలుదేరే సమయానికి 90 నుంచి 120 నిమిషాల ముందే స్టేషన్‌కు చేరుకోవాలన్న నిబంధన మేరకు ముందే ప్రయాణికులు తరలివొచ్చారు. వందల సంఖ్యలో వస్తున్న ప్రయాణికులతో రోడ్డు పైకి క్యూ కట్టారు. స్టేషన్‌లో ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా నేలపై గుర్తులు వేశారు. స్టేషన్‌కు చేరుకున్న ప్రయాణికులకు పరీక్షల అనంతరం ఎటువంటి లక్షణాలు లేకుంటేనే అధికారులు వారికి లోపలికి అనుమతి ఇస్తున్నారు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
Next Story
More Stories