ఏపీలో వేడెక్కిన పంచాయతీ ఎన్నికలు

X
Representational Image
Highlights
* ఉద్యోగ సంఘాల మధ్య విభేదాలు * ఎన్నికల శిక్షణపై షెడ్యుల్ విడుదల చేసిన ఎస్ఈసీ * ఎలక్షన్ విధులు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్టుపై శిక్షణ
Sandeep Eggoju28 Jan 2021 2:43 AM GMT
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఊపందుకుంది. ఒకవైపు ఉద్యోగ సంఘాల మధ్య విభేదాలు మరోవైపు ఎన్నికల విధులపై శిక్షణకు షెడ్యుల్ రావడంతో పంచాయతీ ఎన్నికలు ఊపందుకున్నాయి. ఉద్యోగులకు ఎన్నికల శిక్షణపై ఎస్ఈసీ షెడ్యుల్ విడుదల చేసింది. ఎలక్షన్ విధులు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్టుపై శిక్షణ ఇవ్వనుంది. ఆర్ఓలు, ఏఆర్‌లను నియమించనుంది. అధికారులకు, పోలింగ్ సిబ్బందికి రెండు స్టేజీలుగా శిక్షణ ఇవ్వనున్నారు.
ఇవాళ అధికారులకు మొదటి దశ శిక్షణ.. ఫిబ్రవరి 2న అధికారులకు రెండవ దశ శిక్షణ ఇవ్వనున్నారు. పోలింగ్ సిబ్బందికి ఫిబ్రవరి 4న మొదటి దశ ఫిబ్రవరి 6న రెండో దశ శిక్షణ శిబిరం కొనసాగుతుంది. ఫిబ్రవరి 7న మండల పరిశీలకులకు శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లా పంచాయతీ అధికారులు డివిజన్ పంచాయతీ అధికారుల పర్యవేక్షణలో శిక్షణ ఇవ్వనున్నారు.
Web TitleLocal Body Elections Heat in Andhra Pradesh
Next Story