Visakhapatnam: విశాఖలో లైవ్ సర్జికల్ వర్క్ షాప్

Visakhapatnam: విశాఖలో లైవ్ సర్జికల్ వర్క్ షాప్
x
Highlights

ప్రభుత్వ ఈ.ఎన్.టి. వైద్య కళాశాల, ఉత్తర తీరాంధ్ర ఈ.ఎన్.టి. సర్జన్స్ వారి ఆధ్వర్యంలో స్కాల్ బేస్ శస్త్రచికిత్స వర్క్ షాప్ ను విశాఖ ఈ.ఎన్.టి వైద్యశాలలో నిర్వహిస్తున్నారు.

విశాఖపట్నం: ప్రభుత్వ ఈ.ఎన్.టి. వైద్య కళాశాల, ఉత్తర తీరాంధ్ర ఈ.ఎన్.టి. సర్జన్స్ వారి ఆధ్వర్యంలో స్కాల్ బేస్ శస్త్రచికిత్స వర్క్ షాప్ ను విశాఖ ఈ.ఎన్.టి వైద్యశాలలో నిర్వహిస్తున్నారు. ఈ వర్క్ షాప్ ను కేజీహెచ్ సూపర్డెంట్ అర్జున్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ టి.ఎన్ జానకిరామ్ ప్రఖ్యాత అంతర్జాతీయ రైనాలజీ, స్కాల్ బేస్ శస్త్రచికిత్స వైద్యులు హాజరావుతున్నారు.

ముక్కు, పారానాసల్, సైనస్, అదినోయీడిటిస్, సెపిటిల్ సర్జరీ స్కాల్ బేస్ వంటి సంబంధిత వ్యాధులు, రుగ్మతలు, పుర్రె సంబంధిత కణితలు మొదలైన వివిధ రకాల శస్త్ర చికిత్సలు చేస్తూ వాటిపై జూనియర్ వైద్యులకు అవగాహన కల్పిస్తారని, లక్రిమాల్ సాక్ సమస్యలు, కళ్ళ లోపాలు, ముక్కు ద్వారా మెదడు ద్రవం యొక్క లీక్ వంటి వ్యాధులకు కూడా శాస్త్ర చికిత్స నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, చతిస్ఘడ్, వెస్ట్ బెంగాల్ నుండి 200 వందల మంది ప్రతి నిధులు ఈ వర్క్ షాప్ పాల్గొంటారని ఆర్గనైజింగ్ చైర్మన్ జి.రఘునాథబాబు తెలియజేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories