తిరుమలలో మద్యం కలకలం

తిరుమలలో మద్యం కలకలం
x
Highlights

♦ పుణ్యక్షేత్రంలో దొంగ దందా ♦ మద్యం సీసాలు, సిగరెట్లతో పట్టుబడ్డ వ్యక్తి

(తిరుమల, శ్యామ్.కె.నాయుడు)

తిరుమల పుణ్యక్షేత్రంలో నిషేధిత మత్తు పద్దార్థలతో ఓ వ్యక్తి పట్టుబడ్డాడు, స్థానిక లేపాక్షి కూడలిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని రక్షక్ పోలీసులు అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా, అతని వద్దనున్న సంచిలో 17 మద్యం సీసాలు, సిగరెట్ ప్యాకెట్లు, బీడీ కట్టలు, పొగాకు ప్యాకెట్లు దొరికాయి.

దీంతో అతన్ని వెంటనే ఎక్సైజ్ శాఖ పోలీసులకు అప్పగించారు, ప్రాధమిక విచారణలో పట్టుబడ్డ వ్యక్తి తిరుపతికి చెందిన లోకనాథం గా గుర్తించారు.భద్రతా సిబ్బంది కళ్లుకప్పి అక్రమదారిలో మత్తు పదార్థాలను తిరుమల‌ కొండపైకి తీసుకొచ్చి అధికధరలకు విక్రయించి అక్రమార్జన చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.ఈ క్రమంలో నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories