సోమశిల జలాశయంలో రెండు గేట్ల ఎత్తివేత

సోమశిల జలాశయంలో రెండు గేట్ల ఎత్తివేత
x
Highlights

సోమశిల జలాశయంలో రెండు గేట్ల ఎత్తివేత సోమశిల జలాశయంలో రెండు గేట్ల ఎత్తివేత

నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తారు అధికారులు. దీంతో దాదాపు పదేళ్ల తరువాత గేట్లు తెరుచుకున్నట్టయింది. దీంతో పెన్నానది దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. కొద్దిరోజులుగా రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సోమశిల జలాశయానికి భారీగా వరదనీరు చేరింది. రెండు నెలల క్రితం కేవలం మూడు టిఎంసిల నీరు మాత్రమే ఉన్న ప్రాజెక్టులో అనుకోని విధంగా నిండు కుండలా మారింది. దశలవారిగా శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు చేరుకున్నాయి..

సోమశిల పూర్తి సామర్థ్యం 78 టిఎంసిలు, ప్రస్తుతం 74 టిఎంసిలకు చేరింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తరువాత తొలిసారి భారీగా నిల్వచేశారు. గతంలో 68 టిఎంసిల మాత్రమే ఈ జలాశయంలో ఉంచారు. శనివారం సోమశిల నుంచి కిందకు నీరు విడుదల చేశారు. 11వ గేటు ద్వారా పెన్నాకు 27 వేల క్యూసెక్కులు విడుదల చేశారు. తాజాగా మరో రెండు గేట్ల ద్వారా నీటిని విడుదల చేయడం గమనార్హం. ఇదిలావుంటే సోమశిల ప్రాజెక్టును జల పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories