లైసెన్సు, ఆర్‌.సి. కార్డులు నేరుగా రవాణా కార్యాలయంలో పొందవచ్చు

లైసెన్సు, ఆర్‌.సి. కార్డులు  నేరుగా రవాణా కార్యాలయంలో పొందవచ్చు
x
Highlights

వివిధ కారణాల వల్ల వాహనదారులకు అందని లైసెన్సు, ఆర్‌.సి. కార్డులను సంబంధిత వ్యక్తి నేరుగా రవాణా కార్యాలయం వద్దకు వచ్చి కార్డులు తీసుకోవచ్చునని డీటీసీ జి.సి.రాజారత్నం తెలియజేశారు.

విశాఖపట్నం: వివిధ కారణాల వల్ల వాహనదారులకు అందని లైసెన్సు, ఆర్‌.సి. కార్డులను సంబంధిత వ్యక్తి నేరుగా రవాణా కార్యాలయం వద్దకు వచ్చి కార్డులు తీసుకోవచ్చునని డీటీసీ జి.సి.రాజారత్నం తెలియజేశారు. అక్టోబరు 31లోపు లైసెన్సులు, ఆర్‌.సి.లు పొందిన చోదకులందరి కార్డుల ముద్రణ పూర్తయిందని ఇప్పటికీ కార్డులు అందని వారు ఎవరైనా ఉంటే నేరుగా రవాణా కార్యాలయానికి వచ్చి, ఆధార్‌, సంబంధిత ధ్రువపత్రాలు చూపి కార్డులు పొందవచ్చునన్నారు.

వాహనదారుడి చిరునామా ప్రకారం అక్కడ ఉండకపోవడం, చిరునామా సరిగా లేకపోవడం తదితర సమస్యల వల్ల మొత్తం 5వేల లైసెన్సు, ఆర్‌.సి. కార్డులు తిరిగి కార్యాలయానికి వచ్చాయన్నారు. వాటిని పంపిణీ చేసేందుకు కార్యాలయంలో ప్రత్యేకంగా కౌంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు కార్డులు పొందవచ్చన్నారు. అక్టోబరు 31వ తేదీకి ముందు లైసెన్సు, ఆర్‌.సి. పొంది, కార్డులు అందని వారు వచ్చి తమ కార్డులు తీసుకోవాలని సూచించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories