గ్యాస్ లీకేజీ ఘటనపై స్పందించిన ఎల్‌జీ పాలిమర్స్ యాజమాన్యం.. ఏంచెప్పిందంటే


విశాఖలో విషవాయువు లీకేజ్ ఘటన తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. గ్యాస్ లీకేజీ ఘటనపై ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ యాజమాన్యం స్పందించింది.
విశాఖలో విషవాయువు లీకేజ్ ఘటన తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. గ్యాస్ లీకేజీ ఘటనపై ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ యాజమాన్యం స్పందించింది. ఈ ఘటనపైబాధితులకు క్షమాపణలు చెబుతూ.. వారి కుటుంబాలకు అండగా ఉంటామని స్పష్టం చేసింది. ఇప్పటికే స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామని, విషవాయువు ప్రభావాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వంతో కలిసి తమ బృందాలు పనిచేస్తున్నాయని స్పష్టం చేసింది. దీర్ఘకాలికంగా బాధితులను ఆదుకునేందుకు కార్యక్రమాలను చేపడతామని ప్రకటించింది.
మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చింది. విషవాయువు ప్రభావాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వంతో కలిసి తమ బృందాలు పనిచేస్తున్నాయని వివరించింది. గ్యాస్ లీకేజీ కారణంగా చనిపోయిన మృతుల కుటుంబాలకు సాయం చేసేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను రంగంలోకి దింపామని స్పష్టం చేసింది. విశాఖలో విష వాయువు తీవ్ర విషాదం నింపింది. 12 మంది మరణించగా.. పదుల సంఖ్యలో ప్రజలు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. జగన్ సర్కార్ బాధితుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రకటించింది.
ఈ దుర్ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రమాదకర పరిశ్రమలకు సంబందించిన వివరాల్ని సేకరించింది. జనావాసాల మధ్య ఉన్న పరిశ్రమలు గుర్తించాలని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో 86 ఉన్నాయని పరిశ్రమల ఉన్నట్టు లెక్క తేల్చింది. అధికారులు జిల్లాల వారీగా పరిశ్రమలు గుర్తించారు. లాక్ డౌన్ తర్వాత పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను అధికారులు స్వయంగా పరిశీలించిన తర్వాతే పునఃప్రారంభానికి అనుమతించనున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



