విశాఖ గ్యాస్ లీకేజీపై స్పందించిన సంస్థ ఛైర్మన్‌.. రెండు ఘటనలపై దిగ్భ్రాంతి

విశాఖ గ్యాస్ లీకేజీపై స్పందించిన సంస్థ ఛైర్మన్‌.. రెండు ఘటనలపై దిగ్భ్రాంతి
x
Highlights

విశాఖ ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని విషవాయువు లీకేజీ ఘటనలో ఎల్జీ పాలిమర్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ కూ గ్వాంగ్‌ మో స్పందించారు.

విశాఖ ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని విషవాయువు లీకేజీ ఘటనలో ఎల్జీ పాలిమర్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ కూ గ్వాంగ్‌ మో స్పందించారు. ఈ ఘటనపై ఆయన క్షమాపణ చెప్పారు. సియోల్‌ న్యూస్‌ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఈ మేరకు గ్యాస్‌ లీకేజీ ఘటనపై మాట్లాడుతూ.. గత వారం రోజుల వ్యవధిలో రెండు ప్రమాదాలు చోటుచేసుకోవడం ఎంతో బాధ కలిగించాయని ఆయన చెప్పారు.

విశాఖలో జరిగిన ఘటనతో పాటు, దక్షిణ కొరియాలోని కెమికల్‌ ప్లాంట్‌లో జరిగిన ప్రమాద ఘటనపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెండు ప్రమాదాలపై సంతాపం వ్యక్తం చేసిన కూ గ్వాంగ్‌ మో.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదాలకు సంబంధించి సంస్థ పూర్తి బాధ్యత తీసుకుటుందని కూ గ్వాంగ్‌ మో స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories