అందరం కలిసి తెలుగువారు గర్వపడేలా కృషి : లోకేష్

అందరం కలిసి తెలుగువారు గర్వపడేలా కృషి : లోకేష్
x
Highlights

విశాఖపట్నం: అందరం కలిసి ఏపీ, విశాఖ, తెలుగువారు గర్వపడేలా కృషిచేద్దామని విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపు ఇచ్చారు. విశాఖపట్నంకు అంతర్జాతీయ...

విశాఖపట్నం: అందరం కలిసి ఏపీ, విశాఖ, తెలుగువారు గర్వపడేలా కృషిచేద్దామని విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపు ఇచ్చారు. విశాఖపట్నంకు అంతర్జాతీయ ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ రాక చారిత్రక మైలు రాయి అన్నారు. చంద్రబాబునాయుడు నేతృత్వంలో పనిచేయడం తమ అదృష్టం అన్నారు. ఏపీ ఎకనామిక్ పవర్ హౌస్ గా విశాఖను తీర్చిదిద్దుతామని చెప్పారు. విశాఖ మధురవాడలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ కు శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబునాయుడుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. ఏపీ నాయకత్వంపై విశ్వాసం ఉంచినందుకు కాగ్నిజెంట్ సంస్థ రవి, సూర్యకు ధన్యవాదాలు తెలిపారు. అంతర్జాతీయ స్థాయి దిగ్గజ ఐటీ కంపెనీ విశాఖలో అడుగుపెట్టటం చారిత్రాత్మక మైలు రాయి అన్నారు. ఇవాళ విశాఖపట్టణానికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగానికి చరిత్రాత్మక రోజుగా పేర్కొన్నారు. కాగ్నిజెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య దీర్ఘకాలిక భాగస్వామ్యానికి ఇది ప్రారంభం అని చెప్పారు. వైజాగ్ అభివృద్ధి చెందడం మాత్రమే కాకుండా ముందుండి నడిపిస్తుందన్నారు.

కాగ్నిజెంట్ రాక టెక్ యుగానికి నాంది

‘‘కాగ్నిజెంట్ సంస్థ సుమారు 15 వందల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇప్పటికే తాత్కాలిక క్యాంపస్ లో వెయ్యి మంది పనిచేస్తున్నారు. ఈ కేంద్రం కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై దృష్టి సారించనుంది. ఈ పెట్టుబడి హై క్వాలిటీ జాబ్స్ ను తీసుకురావడమే కాకుండా విశాఖ డిజిటల్ ఎకోసిస్టమ్ ను బలపరుస్తూ.. ఒక కొత్త టెక్ యుగానికి నాంది పలుకుతుంది. ఇది కేవలం భూమిపై పెట్టుబడి కాదు. అవకాశాల్లో పెట్టుబడి. ఈ క్యాంపస్‌లోని ప్రతి సీటు ఒక ఉద్యోగం, ఒక కల, మన యువత భవిష్యత్తు తయారవుతున్న ఒక అవకాశం.’’ మంత్రి లోకేష్ చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories