మండలిలో వైసీపీకి షాక్.. వైసీపీ వ్యూహం విఫలమైంది

మండలిలో వైసీపీకి షాక్.. వైసీపీ వ్యూహం విఫలమైంది
x
మండలిలో వైసీపీకి షాక్.. మండలిలో వైసీపీ వ్యూహం విఫలమైంది
Highlights

శాసనమండలిలో వైసీపీ వ్యూహం విఫలమైంది. రాజధాని వికేంద్రీకరణ బిల్లు సెలక్ట్ కమిటీకి పంపించకుండా చేసిన ప్రయత్నాలు లెక్క తప్పాయి. మండలి చైర్మన్ తీసుకున్న...

శాసనమండలిలో వైసీపీ వ్యూహం విఫలమైంది. రాజధాని వికేంద్రీకరణ బిల్లు సెలక్ట్ కమిటీకి పంపించకుండా చేసిన ప్రయత్నాలు లెక్క తప్పాయి. మండలి చైర్మన్ తీసుకున్న నిర్ణం అధికారపక్షానికి మింగుడు పడటం లేదు. బిల్లులో సవరణలకు టీడీపీ కోరినా బిల్లులు వీగిపోయినా పర్వాలేదన్న ధోరణితో ప్రభుత్వం ఉంది.

ఏపీ శాసనమండలిలో అత్యంత ఉత్కంఠ పరిణామం చోటు చేసుకుంది. రాజధాని వికేంద్రీకరణ బిల్లును సెలక్ట్ కమిటీకి వెళ్లకుండా నిరోదించేందుకు వైసీపీ సర్కార్ విశ్వ ప్రయత్నాలు చేసింది. మంత్రులు, సభ్యులు మండలి చైర్మన్ పోడియం చుట్టుముట్టారు. మొదటి నుంచి వికేంద్రీకరణ బిల్లును వ్యతిరేకిస్తున్న టీడీపీ అదే ధోరణిని ప్రదర్శించి బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించేలా చైర్మన్ పై ఒత్తిడి తెచ్చింది.

వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపడాన్ని అధికార పక్షం సభ్యులు తప్పు బట్టారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా చైర్మన్ వ్యవహరించారంటూ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ చట్టసభల చరిత్రలోనే బ్లాక్‌ డే అని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. మండలి గ్యాలరీల్లో చంద్రబాబు కూర్చొని చైర్మన్ ను ప్రభావితంచేశారని ఆరోపించారు.

మండలిలో మొదటి నుంచి నిబంధనల ఉల్లంఘన జరిగిందన్నారు మంత్రి బుగ్గన. రాష్ట్ర సర్వతోముఖాబివృద్ధికి సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. వికేంద్రీకరణతో పాటు 13 జిల్లాల అభివృద్దే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. సెలెక్ట్ కమిటీ పేరుతో బిల్లులను జాప్యం చేయడం సరికాదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. తప్పుచేసిన వారికి విచక్షణాధికారం ఉంటుందా అని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్నవారు పార్టీలకు అతీతంగా ఉండాలన్నారు. మండలి రూల్ బుక్ ప్రకారం నడుచుకోవాలని కోరామని బొత్స చెప్పారు.

ఐదు కోట్ల మందికి ఉపయోగపడే రెండు బిల్లులను శాసన వ్యవస్థల ముందు పెడితే, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ టీడీపీ సభ్యులపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. బిల్లు విషయంలో ప్రభుత్వానికి మద్దతిచ్చిన వారిపై అనర్హత వేటు వేయించడానికి టీడీపీ రంగం సిద్ధం చేసుకుంది. ఇందుకు భిన్నంగా ఓటింగ్ నేపథ్యంలోనే మరింత మంది టీడీపీ సభ్యులను తమ వైపు లాగేయాలని వైసీపీ కిందామీద పడింది. ఇందుకోసం మంత్రులు అత్యధిక సమయం పాటు శాసనమండలిలోనే గడిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories