నన్ను ఎవరు దుర్భాషలాడారో.. ఏం మాట్లాడారో నాకు తెలియదు : మండలి ఛైర్మన్

నన్ను ఎవరు దుర్భాషలాడారో.. ఏం మాట్లాడారో నాకు తెలియదు : మండలి ఛైర్మన్
x
Highlights

మొన్న(బుధవారం) శాసన మండలిలో చోటుచేసుకున్న పరిణామాలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తనకున్న విచక్షణాధికారంతో రాజధాని, అభివృద్ది వికేంద్రీకరణ బిల్లు,...

మొన్న(బుధవారం) శాసన మండలిలో చోటుచేసుకున్న పరిణామాలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తనకున్న విచక్షణాధికారంతో రాజధాని, అభివృద్ది వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపుతూ శాసన మండలి ఛైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో రాజధాని తరలింపునకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. అయితే.. చైర్మన్ తన నిర్ణయాన్ని ప్రకటించగానే పోడియం వైపు వైసీపీ నేతలు దూసుకొచ్చారని.. అంతకుముందు చైర్మన్ ను తీవ్ర పదజాలంతో దూషించారని టీడీపీ నేతలు ఆరోపించారు. షరీఫ్ గారు ఆయన ఛాంబర్ కు వెళ్తుంటే ఆయన్ని బొత్స ఎదురు పడి ఘోరం గా తిట్టారని టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలకు నేరుగా చైర్మన్ షరీఫ్ వివరణ ఇచ్చారు.

కేకలు వినిపించాయి కానీ.. నాపైన ఎవరు దుర్భాషలాడారు.. ఏం మాట్లాడారో నాకు తెలియదు అని షరీఫ్ అన్నారు. శాసన మండలి చైర్మన్ ను దారుణంగా తిట్టిపోశారని మంత్రి బొత్స సత్యనారాయణపై టీడీపీ , జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. దీనిపై టీడీపీ నేతలు జలీల్ ఖాన్ , కేశినేని నాని, బుద్దా వెంకన్న , బచ్చుల అర్జునుడు, యనమల రామకృష్ణుడు తదితరులు అధికార పక్షంపై తీవ్రంగా విరుచుచుకుపడ్డారు. యనమల అయితే ఒక అడుగు ముందుకేసి మంత్రులు శాసనమండలికి మద్యం సేవించి వచ్చారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దానికి అసెంబ్లీ వేదికగా మంత్రులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

యనమలపై ప్రివిలైజ్ కమిటీకి కూడా ఫిర్యాదు చెయ్యాలని భావిస్తున్నారు. మొత్తానికి మండలి చైర్మన్ నిర్ణయం రెండు పార్టీల మధ్య వివాదాలకు దారితీసింది. ఇదిలావుంటే శాసనమండలి రద్దు దిశగా సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. శాసనమండలి ఉండాలా లేదా అనే అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే రద్దు దిశగానే ప్రభుత్వం వెళుతోందని దాదాపు అర్ధమవుతోంది. నిన్న అసెంబ్లీలో మంత్రులు ఎమ్మెల్యేలు కూడా రద్దు చెయ్యాలనే సీఎంకు సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories