ప్రభుత్వ ఆసుపత్రికి ఎల్ఈడీ లైట్లు వితరణ

ప్రభుత్వ ఆసుపత్రికి ఎల్ఈడీ లైట్లు వితరణ
x
రాజు, వైద్యశాల సూపరిండెంట్ రామకృష్ణ, రమేష్ నాయక్, సుభాష్
Highlights

మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి సమాజ సేవకుడు డుంగావత్ రమేష్ నాయక్ ఎల్ఈడీ లైట్లను వితరణ చేశారు.

నల్లమాడ: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి సమాజ సేవకుడు డుంగావత్ రమేష్ నాయక్ ఎల్ఈడీ లైట్లను వితరణ చేశారు. గత కొద్దికాలంగా ఆస్పత్రి ఆవరణలో లైట్లు పనిచేయకపోవడంతో చీకట్లో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న రమేష్ నాయక్ ఆసుపత్రికి సంబంధించిన వైద్యులతో మాట్లాడి రూ.15వేలు విలువచేసే ఎల్ఈడి లైట్లు, వాటికి కావాల్సిన సామాగ్రిని రమేష్ నాయక్ సోదరుడైన డుంగావత్ రాజు చేతుల మీదుగా వైద్యశాల సూపరిండెంట్ రామకృష్ణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రమేష్ నాయక్, యువ సైన్యం నాయకులు సుభాష్, రమణ, రవి, నారాయణ స్వామి నాయక్ పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories