స్థానిక ఎన్నికల్లో డిపాజిట్లు రావనే భయంతోనే చంద్రబాబు బస్సుయాత్ర

స్థానిక ఎన్నికల్లో డిపాజిట్లు రావనే భయంతోనే చంద్రబాబు బస్సుయాత్ర
x
Highlights

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతి.

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు, వైసీపీ నాయకురాలు, తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతి. చంద్రబాబు వద్ద మూడు లక్షల కోట్ల అవినీతి సొమ్ము ఉందని ఆమె ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా రావనే ఉద్ధేశ్యంలో చంద్రబాబు బస్సుయాత్ర మొదలు పెట్టారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం మాజీ ముఖ్యమంత్రి వెంపర్లాడడం ఇదే మొదటిసారని దుయ్యబట్టారు.

చంద్రబాబు తీరు చూస్తే తీరు నవ్విపోదురుగాక నాకేటీ సిగ్గు అన్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ను విమర్శించడం విడ్డూరంగా ఉందని అన్నారు. అంతర్గతంగా చంద్రబాబు టీడీపీ పనికి రాడని ఆయన మీడియానే చెప్పిందని అన్నారు. ఓ పక్క కేసులు ముంచుకొస్తున్నా జనంలోకి వచ్చి సానుభూతి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు.

సీఎంగా వైఎస్‌ జగన్‌ను చూసి చంద్రబాబు ఓర్చుకోలేక పోతున్నారని ఆరోపించారు. సిగ్గుమాలిన చర్యలు చంద్రబాబుకే మండిపడ్డారు. ఓ కార్మికుడిని 108లో వాహనం తీసుకెళుతుంటే దారి కూడా ఇవ్వలేదని విమర్శించారు. చంద్రబాబుకు జగన్‌ను విమర్శించే నైతిక హక్కు లేదని ఆమె అన్నారు. తొమ్మిది నెలల్లో సీఎం వైఎస్‌ జగన్ ప్రజల మనసు గెలుచుకున్నారని తెలిపారు. అవినీతిని రూపుమాపేందుకు సీఎం వైఎస్‌ జగన్ ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.

రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చంద్రబాబు అంటోన్నారు. వారి జాబితా ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఐటీ సోదాలు ఎవరిపై జరిగాయో వారి చంద్రబాబు చెందిన వారు కాదా అని ప్రశ్నించారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా భూములు కబ్జాలు చేసి సింగపూర్ కంపెనీల ఇచ్చి వాటిని వైట్ మనీగా చేసుకోవాలని చంద్రబాబు చూశారని నందమూరి లక్ష్మీ పార్వతి విమర్శించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories