రాయలసీమలో భూముల ధరలు హైక్..

రాయలసీమలో భూముల ధరలు హైక్..
x
Highlights

ఏపీకి మూడు రాజధానులు వస్తాయేమో అని అసెంబ్లీలో సీఎం జగన్ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి బహుశా మూడు క్యాపిటల్స్ వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్...

ఏపీకి మూడు రాజధానులు వస్తాయేమో అని అసెంబ్లీలో సీఎం జగన్ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి బహుశా మూడు క్యాపిటల్స్ వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యడిషియల్ క్యాపిటల్ రావాల్సిన పరిస్థితి కనిస్తోందని అన్నారు. దీంతో కర్నూలు వాసులు సంతోషంలో మునిగిపోయారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచే రాయలసీమలో భూముల ధరలకు రెక్కలొచ్చాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇందుకు కారణం కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ, కర్నూలులో హైకోర్టు వస్తాయన్న కారణమే అట.

జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నెలరోజులకు జమ్మలమడుగు వేదికగా స్టీల్ ఫ్యాక్టరీ ప్రకటన చేశారు. దాంతో భూముల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అక్కడ పండే భూములు అయితే ఏకంగా రూ.5 లక్షల నుంచి 50 లక్షల వరకు పలుకుతున్నాయట. అలాగే బీడు భూములు సైతం 25 లక్షలు పలుకుతోందట. దీనికి కారణం ఆ ప్రదేశంలో స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చెయ్యబోతుండటమే అని అంటున్నారు.

ఇటు కర్నూలు జిల్లాలో కూడా గత ఆరునెలల కాలంలో భూముల ధరలు అమాంతం పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన జి ఎన్ రావు కమిటీ గత నెలలో కర్నూలును సందర్శించింది. ఈ సందర్బంగా ఆ కమిటీ సభ్యులు ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయని ఆరాతీసింది. ఈలోపే కర్నూలులో ఏదో జరగబోతోందని రియల్టర్లు ప్రచారం చేశారు. దాంతో ఓర్వకల్లు, కాల్వబుగ్గ, ఉషణాపురం తదితర ప్రాంతాల్లో భూముల ధరలు ఒక్కసారిగా పెరిగాయట. ఇటు అనంతపురం జిల్లాలో కూడా పుట్టపర్తి, పెనుగొండ, హిందూపురం, అనంతపురం తదితర ప్రాంతాల్లో భూములు ధరలకు రెక్కలొచ్చాయని అంటున్నారు.

ఇందుకు కారణం ఇప్పటికే కియా వంటి ప్రాజెక్టు ఉండటమే కాక త్వరలో వెయ్యి కోట్లతో అనంతపురంలో ఎలక్ట్రిక్ బస్సుల నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే వీరా వాహన ఉద్యోగ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో ఒప్పందం కూడా చేసుకున్నారు. దీనికి తోడు హిందూపురం, పుట్టపర్తి కేంద్రంగా మరికొన్ని పారిశ్రామిక సంస్థలు రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కారణాలతో రాయలసీమ జిల్లాలో గతం కంటే ఎక్కువగా భూముల ధరలు పలుకుతున్నాయని అంటున్నారు విశ్లేషకులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories