నా స్థలాన్ని కబ్జా చేసి టీడీపీ కార్యాలయం నిర్మాణం : రైతు ఆరోపణ

నా స్థలాన్ని కబ్జా చేసి టీడీపీ కార్యాలయం నిర్మాణం : రైతు ఆరోపణ
x
Highlights

నా స్థలాన్ని కబ్జా చేసి టీడీపీ కార్యాలయం నిర్మాణం : రైతు ఆరోపణ నా స్థలాన్ని కబ్జా చేసి టీడీపీ కార్యాలయం నిర్మాణం : రైతు ఆరోపణ

మంగళగిరిలోని ఆత్మకూరులో తన స్థలాన్ని కబ్జా చేసి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని స్థానిక రైతు ఉమమహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు కొన్ని పత్రాలను మీడియా ముందు ఉంచారు. 45 ఏళ్ల నుంచి ఆ భూమి తమ ఆధీనంలో ఉందని, రెవెన్యూ అధికారులు పట్టా కూడా ఇచ్చారని ఆయన చెప్పారు. తన స్థలాన్ని కబ్బా చేసి టీడీపీ కార్యాలయం నిర్మిస్తున్నారని కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే.. కోర్టు స్టే ఇచ్చిందని.. కానీ కోర్టు ఆదేశాలను పక్కనబెట్టి ప్రస్తుతం కబ్జా చేసిన స్థలంలో టీడీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని ఉమమహేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. అంతేకాకుండా తన పొలంలోకి కూడా రానివ్వకుండా రేకులు అడ్డు పెట్టినట్టు ఆయన ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై టీడీపీ నేతలెవ్వరూ నోరు మెదపలేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories