రేపే 'లక్ష్మీస్‌ ఎన్‌టీఆర్‌' విడుదల..

రేపే లక్ష్మీస్‌ ఎన్‌టీఆర్‌ విడుదల..
x
Highlights

మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు జీవితంలో చోటుచేసుకున్న ఒడిదుడుకుల సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన 'లక్ష్మీస్‌ ఎన్‌టీఆర్‌' ముఖ్యంగా...

మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు జీవితంలో చోటుచేసుకున్న ఒడిదుడుకుల సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన 'లక్ష్మీస్‌ ఎన్‌టీఆర్‌' ముఖ్యంగా ఎన్టీఆర్ జీవితంలోకి ఆయన రెండో భార్య లక్ష్మి పార్వతి ప్రవేశించాక జరిగిన ఘటనల ఆధారణగా ఈ సినిమా తెరకెక్కింది. సినిమా ఏపీలో మే 1న బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

చిత్తూరు జిల్లా పలమనేరులోని మంజునాథ థియేటర్‌లో బుధవారం ఉదయం 9.47 గంటలకు ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్ర దర్శకులు రామ్‌గోపాల్‌ వర్మ, నటీ నటులు హాజరుకానున్నట్టు చిత్ర నిర్మాత రాకేష్‌రెడ్డి వెల్లడించారు. కాగా ఎన్నికల ముందే ఈ సినిమా ఏపీలో విడుదల అవ్వాల్సి ఉండగా టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయించడంతో వాయిదా పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories