logo
ఆంధ్రప్రదేశ్

విశాఖలో లేడీ కానిస్టేబుల్ ఆత్మహత్య

విశాఖలో లేడీ కానిస్టేబుల్ ఆత్మహత్య
X
Highlights

ఏపీలో సంచలనం సృష్టించిన విశాఖ జిల్లా, నక్కపల్లి లేడీ కానిస్టేబుల్ ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. విశాఖ నక్కపల్లిలో లేడీ కానిస్టేబుల్‌ భవానీ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది.

ఏపీలో సంచలనం సృష్టించిన విశాఖ జిల్లా, నక్కపల్లి లేడీ కానిస్టేబుల్ ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. విశాఖ నక్కపల్లిలో లేడీ కానిస్టేబుల్‌ భవానీ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. కానిస్టేబుల్ భవానీకు నాగళ్ళ సింహాద్రితో పెన్నెండేళ్ళ క్రితం వివాహమైంది. సింహాద్రి దినసరి కూలీగా తన కుటుంబంతో జీవనం సాగిస్తుండగా, రెండున్నరేళ్ళ క్రితం భవానీకి మహిళా కానిస్టెబుల్ గా పోలీస్ శాఖలో ఉద్యోగంలో చేరింది.

అయితే రెండేళ్ళనుంచి భవానీ ప్రవర్తనలో మార్పు రావటంతో కుటుంబంలో కలతలు వచ్చినట్లు ఆమె భర్త సింహాద్రి తెలిపారు. తీరు మార్చుకోమని కుటుంబ సభ్యులు హెచ్చరించినప్పటికీ ఆమె పెడచెవిన పెట్టిందని సింహాద్రి చెపుతున్నాడు. మరోవైపు భవానీని భర్తే హత్య చేశాడంటూ మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నక్కపల్లి సిఐ విజయకుమార్, ఎస్ఐ శివరామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నక్కపల్లి ఎస్.ఐ రామకృష్ణ తెలిపారు. భర్త సింహాద్రిపై 302, 201 సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు.Web TitleLady Constable Bhavani suicide in Visakhapatnam district
Next Story