Andhra Pradesh: తిరుపతి పంచాయతీ ఎన్నికల ప్రచారంలో శ్రీవారి లడ్డూలు

Laddu Distribution in Tirupati Panchayat Elections campaign
x

లడ్డు  డిస్ట్రిబ్యూషన్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Andhra Pradesh: తొండవాడ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో శ్రీవారి ప్రసాదాలు

Andhra Pradesh: ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డబ్బు పంపిణీ చేస్తారు. లేదా మద్యం సరఫరా చేస్తారు. ఇంకాస్త ముందుకు పోతే ఇన్ని ఓట్లకు ఇంత సొమ్ము అని ప్యాకేజీలు మాట్లాడుకుంటారు. ఎన్నో రకాలుగా ఓటర్లను మభ్య పెడుతుంటారు అభ్యర్థులు. అయితే ఇప్పుడు కొత్త తరహాలో ఓట్లను అభ్యర్థించడం మొదలు పెట్టారు.

తిరుపతి పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అధికార పార్టీ నేతలు ఓటర్‌ స్లిప్పులతో పాటు శ్రీవారి లడ్డూ ప్రసాదం పంచడం వివాదాలకు దారి తీసింది. తొండవాడ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు శ్రీవారి లడ్డూ ప్రసాదం అందించారు పార్టీ శ్రేణులు. ఇంటింటికీ రేషన్‌ వాహనాల్లో లడ్డూలను పంచుతూ వైసీపీ మద్దతుదారులకు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. అధికారులు, టీటీడీ సిబ్బంది తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే మూడు దఫాలు పూర్తికాగా ఈ నెల 21న చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఇప్పటివరకూ వచ్చిన ఫలితాలను పరిశీలిస్తే.. మూడు విడతల్లోనూ వైసీపీ మద్దతుదారుల హవా కొనసాగింది. ఇక.. చివరి విడతలోనూ అదే పంథా కొనసాగించాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories