తెలుగు రాష్ట్రాల్లో పనివారి కొరత : ఉచిత పథకాల ప్రభావం

తెలుగు రాష్ట్రాల్లో పనివారి కొరత : ఉచిత పథకాల ప్రభావం
x
Highlights

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రాబోయే కాలంలో పనులు చేసేవారు దొరక్క తీవ్ర సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు కీలక రంగాల్లో ఇతర రాష్ట్రాల ప్రజలు పాతుకుపోయారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రాబోయే కాలంలో పనులు చేసేవారు దొరక్క తీవ్ర సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు కీలక రంగాల్లో ఇతర రాష్ట్రాల ప్రజలు పాతుకుపోయారు. రెండు చోట్ల ప్రభుత్వాల ఉచిత పథకాలకు అలవాటుపడిన ప్రజలు పనులు చేయడానికి పెద్దగా ఇష్టపడటంలేదు. దాంతో ముందుముందు పనివారి కొరత ఎక్కువైపోతుంది. దాంతో ఇతర రాష్ట్రాల వారు ఇక్కడి పనులకు ఎగబడతారు. ఇప్పటికే నిర్మాణాలు జరిగే ప్రతి ప్రాంతంలో వారు స్థిరపడిపోయారు. వారు రానిదే పనులు జరగని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంగా ఏపీలో అమరావతి, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు...తదితర ప్రాంతాలతోపాటు తెలంగాణలోని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఇప్పటికే ఇతర రాష్ట్రాల వారు అన్ని పనులు చేస్తున్నారు.

ఇది ఇలాగే కొనసాగితే తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయం పడుతున్నారు. గతంలో తెలుగు రాష్ట్రాల్లో కేరళవారు ఎక్కవగా హోటళ్లు, టీ షాపులు నడిపేవారు. ఇప్పుడు వారితోపాటు రాజస్థాన్ వారు టీ షాపులు, స్వీట్ షాపులు ఎక్కువగా నడుపుతున్నారు. రెండు రాష్ట్రాలలో నిర్మాణాలు జరిగే ప్రతి ప్రాంతంలోనూ వారు చేసే పనుల వివరాలు ఈ దిగువ తెలిపినవిధంగా ఉన్నాయి.

బీహార్ వారు: నిర్మాణ పనులు, ఇటుక బట్టి పనులు, చిన్న చిన్న ఫ్యాక్టరీలు, వరినాట్లు, పత్తి ఏరే పనుల వరకు అన్ని రకాల కూలి పనులు చేస్తున్నారు.

ఒరిస్సా వారు : అన్ని రకాల కార్మికులుగా, వంటకాల తయారీలో కూడా పనులు చేస్తున్నారు.

రాజస్థాన్ వారు: టీ స్టాల్, హోటల్, సానిటరీ షాప్‌లు, ఎలక్ట్రిక్ షాపులు నిర్వహిస్తున్నారు

ఉత్తరప్రదేశ్ వారు: టైల్స్ వేసే పని నుండి పెయింటింగ్, అన్ని రకాల ఇంటి లోపలి అలంకరణలు చేస్తున్నారు .

కేరళ వారు: హోటళ్లు, టీ షాపులు నిర్వహణతోపాటు నర్సులు, ఇంగ్లీష్ బోధించు టీచర్లుగా పని చేస్తున్నారు.

కర్ణాటక వారు: ఎక్కవగా భవన నిర్మాణ కూలీలుగా పని చేస్తున్నారు.

ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి ఏదో ఒక రకంగా ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు మాత్రం ప్రభుత్వ ఉచిత పథకాలకు అలవాటుపడిపోయారు. రోజుకో రాజకీయ పార్టీ జెండా పట్టుకోవడం మందు, మాంసం ఎవడు పంచుతాడా అని ఎదురు చూడటానికి అలావాటుపడిపోయారు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే, వారి జెండా పట్టుకుని వారి ఉద్యమాలలో పాల్గొంటున్నారు. ఆ ఉద్యమాలు, ఆ ఆందోళన కార్యక్రమాలు ఎందుకు చేస్తారో కూడా వారికి తెలియదు. తెలిసిన పనిని, చేతిలో ఉన్న వృత్తినీ వదిలేసి ఎవరు డబ్బు ఇస్తే, వారి జెండా పట్టుకుని తిరగడానికి అలవాటుపడిపోయారు. ఉచితాలకు అలవాటుపడి సమయాన్ని వృధా చేస్తూ వ్యసనాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

మన నిపుణులు విదేశాలకు వెళ్లి ఎలా డబ్బు సంపాదిస్తున్నారో, ఆ దేశాలలో సంపాదించిన డబ్బు మన దేశానికి ఎలా తెస్తున్నారో, ఇతర రాష్ట్రాల కూలీలు కూడా ఇక్కడకు వచ్చి డబ్బు సంపాదించుకుని వారి రాష్ట్రాలకు తరలిస్తారు. సంక్షేమ ప్రభుత్వాలు వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి, విద్య, వైద్యంకు పథకాలు తప్పక ప్రవేశపెట్టాలి. అయిదే, మన ప్రభుత్వాలు అవసరంలేని వారికి కూడా ఉచితాలు ఇవ్వడం వల్ల వారు సోమరిపోతుల్లా తయారవుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సంపదను ఇతర రాష్ట్ర ప్రజలు గణనీయంగా తీసుకువెళ్లే ప్రమాదం ఉంది. ఇక్కడి వారు పని చేసే అలవాటు (Work Culture) కూడా మర్చి పోతారు. ఇటువంటి ప్రమాద పరిస్థితులు తలెత్తకముందే ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పని కల్చర్ ని పెంచే మార్గాలను అన్వేషించవలసి ఉంది. వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి, విద్య, వైద్యానికి ఎక్కువ నిధులు కేటాయిస్తే సరిపోతుందన్న అభిప్రాయం ఎక్కవ మందిలో వ్యక్తమవుతోంది. ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయవలసి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories