బాలయ్య చిన్నల్లుడికి భారీ షాక్‌

బాలయ్య చిన్నల్లుడికి భారీ షాక్‌
x
Highlights

టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం సంస్థల అధినేత శ్రీభరత్‌కు బ్యాంక్ షాకిచ్చింది. రూ.124.39కోట్లు చెల్లించాలని కరూర్...

టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం సంస్థల అధినేత శ్రీభరత్‌కు బ్యాంక్ షాకిచ్చింది. రూ.124.39కోట్లు చెల్లించాలని కరూర్ వైశ్యాబ్యాంక్ నోటీసులు పంపించింది. రుణాల చెల్లింపు ఎగవేసిన కారణంగా భరత్‌ తండ్రి పట్టాభి రామారావు సహా ఇతర కుటుంబీకుల ఆస్తుల జప్తునకు అబిడ్స్‌ కరూర్‌ వైశ్యా బ్యాంకు నోటీసులు జారీ చేసింది. నోటీసులకు శ్రీభరత్ స్పందించకపోవడంతో ఏకంగా ఆస్తుల జప్తుకు సిద్ధమయ్యింది.

టెక్నో యూనిట్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట శ్రీ భరత్ కుటుంబం గతంలో హైదరాబాద్ అబిడ్స్ బ్రాంచ్‌లో గాజువాక, భీమిలిలోని భూములు తాకట్టు పెట్టి దాదాపు రూ.124 కోట్లకు పైగా రుణాలు తీసుకున్నారు. అప్పటినుంచీ ఇప్పటివరకూ వడ్డీ కూడా కట్టకపోవడంతో బ్యాంకు నోటీసులు జారీ చేసింది. కాగా ఈ అప్పును 21.01.2020 నాటికి కంపెనీ పేరిట తీసుకున్న వడ్డీతో కలిపి అసలు కూడా కలిపి చెల్లించాలని నోటీసులో తెలిపింది బ్యాంకు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories