కోడిగుడ్ల కోసం కొట్టుకున్న వైసీపీ నేతలు

కోడిగుడ్ల కోసం కొట్టుకున్న వైసీపీ నేతలు
x
Highlights

కోడిగుడ్ల కోసం కొట్టుకున్న వైసీపీ నేతలు కోడిగుడ్ల కోసం కొట్టుకున్న వైసీపీ నేతలు

కర్నూలు కలెక్టరేట్‌ ప్రాంగణంలో వైసీపీ నేతలు హల్చల్ చేశారు. పాఠశాలకు సప్లై చేసే కోడిగుడ్ల టెండర్లు నందికొట్కూరుకు చెందిన యువనేత, డోన్ నాయకుడు దక్కించుకునేందుకు ప్రయత్నించారు.. అయితే మాకు కావాలంటే.. మాకు కావాలని రెండు గ్రూపులు వాదించుకున్నాయి. ఎవరూ తగ్గకపోవడం తోపాటు తిట్ల దండకం మొదలుపెట్టారు. దీంతో వివాదం ముదిరి ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. పరస్పరం రాళ్ళూ రువ్వుకున్నారు.. కర్రలతో బాదేసుకున్నారు.

ఈ దాడిలో డోన్ వైసీపీ నాయకుడు సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. DEO ఆఫీసు ఎదుటనే తీవ్రంగా కొట్టుకోవడంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దుండగులు DEO ఆఫీసులోకి కూడా చొరబడడంతో… సిబ్బంది బెంబేలెత్తిపోయారు. ఇంతలో పోలీసుల రాకతో ఈ మూక అక్కడినుంచి పరార్‌ అయింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా… వారిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories