లాక్ డౌన్ : దయచేసి బయటకు రావద్దు.. కన్నీళ్లు పెట్టిస్తున్న పోలీసుల వీడియో

లాక్ డౌన్ : దయచేసి బయటకు రావద్దు.. కన్నీళ్లు పెట్టిస్తున్న పోలీసుల వీడియో
x
Highlights

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నడుస్తోంది.

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో రోడ్లపైకి రావొద్దని ప్రజలు ఇళ్లలోనే ఉండాలని చెబుతున్నా నిబంధనలు ఉల్లఘించి మరి కొంతమంది ఆకతాయిలు యధేచ్ఛగా బయట తిరుగుతున్నారు. పోలీసులు 24 గంటలు రోడ్లపైనే గడిపేస్తున్నారు. రోడ్ల మీదకు వస్తున్నారు. పోలీసులు మొత్తుకుని చెబుతున్నా మాట వినకుండా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. అయితే వారిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీలకు చెబుతున్నారు.

పోలీసులు అకారణంగా అమాయకుల్ని కొడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. పోలీసుల కష్టాలను కూడా అర్ధం చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. రాత్రి పగలు వారు పడుతున్న కష్టాలను చూసి ఎవరూ వల్ల గురించి ఆలోచించడం లేదు. వాళ్లకు కుటుంబాలు ఉన్నాయి. మరోవైపు కరోనా భయం వెంటాడుతోంది. ఇళ్ళలకు వెళ్లకుండా ప్రజల కోసం వారు రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లా పాణ్యం పోలీసులు వినూత్నమైన ఆలోచన చేశారు.

ఓ లఘు చిత్రం ద్వారా యువతకు సందేశం ఇచ్చారు. చిన్న చిన్న కారణాలతో బయటకు వస్తున్నారు. మీ కాళ్లు మొక్కి చెప్పడానికైనా సిద్ధం.. దయచేసి బయటకు రావ్దొదు అంటూ 20 సెకన్ల వీడియో ఆలోచింపజేస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది. కొంతమంది లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి బయటకు వస్తున్నారని, వారికి పరిస్థితి అర్థమయ్యేలా చెప్పేందుకే ఈ షార్ట్ ఫిల్మ్ చేశామని పోలీసులు అంటున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories