అక్రమ మద్యం యూనిట్లను ధ్వంసం చేసిన పోలీసులు

అక్రమ మద్యం యూనిట్లను ధ్వంసం చేసిన పోలీసులు
x
Highlights

అక్రమమద్యం తయారీపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కర్నూల్ జిల్లా బనగానిపల్లె మండలంలోని కొండమ్మనాయుని పల్లె సమీపంలోని కొండల్లో ఎక్సైజ్ పోలీసులు...

అక్రమమద్యం తయారీపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కర్నూల్ జిల్లా బనగానిపల్లె మండలంలోని కొండమ్మనాయుని పల్లె సమీపంలోని కొండల్లో ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి అక్రమ మద్యం తయారీ యూనిట్లను ధ్వంసం చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్ర మోహన్ మాట్లాడుతూ.. కొండపై అక్రమ మద్యం తయారవుతున్నట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు, దీంతో దాడులు నిర్వహించి యూనిట్లను ధ్వంసం చేసినట్టు వెల్లడించారు. దాడుల గురించి తెలుసుకున్న మద్యం తయారు దారులు.. పదార్థాలను వదిలిపెట్టి అక్కడి నుండి పారిపోయారు.

ఈ దాడిలో 7,000 లీటర్ల బెల్లం వాష్, 200 లీటర్ల తయారు చేసిన మద్యాన్ని పట్టుకున్నట్టు ఆయన చెప్పారు. పరారీలో ఉన్న వ్యక్తుల కోసం గాలిస్తున్నామని.. పట్టుబడితే కఠినంగా శిక్షిస్తామని సిఐ తెలిపింది. నకిలీ మద్యం అమ్మకాలకు పాల్పడితే ఎంతటివారైనా కఠిన చర్యలను ఎదుర్కొంటారని ఆయన హెచ్చరించారు. ఈ దాడిలో సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, ఇతర పోలీసు బృందం పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories