ఏపీలో ఉల్లి రైతు పంట పండింది.. రికార్డు స్థాయిలో క్వింటాల్‌ ధర

ఏపీలో ఉల్లి రైతు పంట పండింది.. రికార్డు స్థాయిలో క్వింటాల్‌ ధర
x
Highlights

ఉల్లి రైతు పంట పండింది. క్వింటాల్‌ ధర ఆల్‌టైమ్ గరిష్ఠంగా రూ .6,470 ను తాకింది. గత ఐదేళ్లలో ఇదే అత్యధిక ధర. అధిక ధర రైతులకు ఉత్సాహాన్ని కలిగించగా,...

ఉల్లి రైతు పంట పండింది. క్వింటాల్‌ ధర ఆల్‌టైమ్ గరిష్ఠంగా రూ .6,470 ను తాకింది. గత ఐదేళ్లలో ఇదే అత్యధిక ధర. అధిక ధర రైతులకు ఉత్సాహాన్ని కలిగించగా, వినియోగదారుల కళ్ళకు కన్నీళ్లు తెప్పించాయి. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పంట నష్టం కారణంగా భారీగా ఉల్లిపాయల ధర పెరిగింది. ఈ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా దాదాపు 90 శాతం ఉల్లి పంట దెబ్బతింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లోని రైతులకు ఇది వరంలా మారింది. ఉల్లిపాయ పంటను ఎక్కువగా అనంతపూరం, కడప, కర్నూలులో సాగు చేస్తారు. అంతకుముందు సంవత్సరం 32,000 హెక్టార్లలో ఉల్లి సాగుచేస్తే.. ఈ ఖరీఫ్ సీజన్లో 26,000 హెక్టార్లలో పంటను పండించారు. అయితే మూడేళ్ల నుంచి ఉల్లిపాయ క్వింటాల్‌కు రూ.150 నుంచి రూ. 200 మధ్య మాత్రమే ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

దీంతో పంట సాగుచేసేందుకు తీసుకున్న అప్పులను రైతులు తిరిగి చెల్లించలేకపోయారు. అనేక మంది రైతులు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. అయితే ఈ సంవత్సరం వారికి పూర్తిగా లాభాలు తెచ్చిపెట్టింది ఉల్లిపంట. ఒక్కో ఎకరానికి పెట్టుబడి పోను 50 వేల రూపాయలు పైగానే మిగిలాయి. కర్నూలు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ మార్కెటింగ్ మేనేజర్ సత్యనారాయణ చౌదరి మాట్లాడుతూ.. క్వింటాల్‌కు 6,470 రూపాయల ధర ఈ సీజన్‌లో అత్యధికమని చెప్పారు. ప్రస్తుతం పక్క రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడం, ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో ధరలు అమాంతం పెరిగాయన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories