AP News: కర్నూలులో దారుణం.. ప్రియుడి భార్యపై 'వైరస్ ఇంజెక్షన్'తో దాడి.. తల్లీకాబోతున్న మహిళపై కిరాతకం!

AP News
x

AP News: కర్నూలులో దారుణం.. ప్రియుడి భార్యపై 'వైరస్ ఇంజెక్షన్'తో దాడి.. తల్లీకాబోతున్న మహిళపై కిరాతకం!

Highlights

Kurnool News: కర్నూలులో దారుణం! ప్రియుడు దూరం పెడుతున్నాడని అతని భార్యపై వైరస్ ఇంజెక్షన్‌తో దాడి చేసింది ఓ మహిళ.

Kurnool News: అక్రమ సంబంధం ఓ మహిళను కిరాతకురాలిగా మార్చింది. తనను దూరం పెడుతున్నాడన్న కోపంతో, ప్రియుడి భార్యను అంతమొందించేందుకు ఏకంగా 'వైరస్ ఇంజెక్షన్'తో దాడికి పాల్పడిన ఘటన కర్నూలు నగరంలో సంచలనం సృష్టించింది. శనివారం కర్నూలు డీఎస్పీ బాబూప్రసాద్, సీఐ శేషయ్య ఈ కేసు వివరాలను వెల్లడించారు.

నిర్లక్ష్యం చేశాడని కక్ష..

పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలుకు చెందిన ఓ వైద్యుడికి, వసుంధర అనే మహిళతో గతంలో సన్నిహిత సంబంధం ఉండేది. అయితే, కొంతకాలం క్రితం ఆ వైద్యుడికి వివాహం కావడంతో అతను వసుంధరను దూరం పెట్టడం ప్రారంభించాడు. తనను నిర్లక్ష్యం చేస్తున్నాడన్న కోపంతో, వైద్యుడి సంసారంలో నిప్పులు పోయాలని వసుంధర నిర్ణయించుకుంది. అతని భార్యను వదిలించుకుంటేనే తనకు దారి దొరుకుతుందని భావించి దారుణానికి ఒడిగట్టింది.

సినిమా ఫక్కీలో స్కెచ్..

ఈ నెల 9న పక్కా ప్లాన్ ప్రకారం వసుంధర తన అనుచరులతో కలిసి దాడికి దిగింది.

ప్రమాదం సృష్టించి: వైద్యుడి భార్య ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, ఆమెను వాహనంపై నుంచి కింద పడిపోయేలా చేశారు.

సాయం చేస్తున్నట్లు నటిస్తూ: ఆమె కింద పడగానే, సాయం చేసే నెపంతో ముగ్గురు వ్యక్తులు ఆమెను బలవంతంగా ఆటోలోకి ఎక్కించారు.

వైరస్ ఇంజెక్షన్‌తో దాడి: ఆటోలో అప్పటికే వేచి ఉన్న వసుంధర, బాధితురాలిపై ప్రాణాంతక వైరస్ ఇంజెక్షన్‌తో దాడి చేసింది.

బాధితురాలు ప్రాణభయంతో గట్టిగా కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే ఆస్పత్రిలో చేరడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది.

నిందితుల అరెస్ట్

బాధితురాలి భర్త (వైద్యుడు) ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మూడో పట్టణ పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీలు, టెక్నికల్ డేటా ఆధారంగా కేసును చేధించారు. ప్రధాన నిందితురాలు వసుంధరతో పాటు ఆమెకు సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రియుడిపై ఉన్న కక్షను గర్భిణి అని కూడా చూడకుండా అతని భార్యపై చూపడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories