Kurichedu Sanitizer Case Update : కురిచేడు శానిటైజర్ మృతుల ఘటనను చేదించిన సిట్

Kurichedu Sanitizer Case Update : కురిచేడు శానిటైజర్ మృతుల ఘటనను చేదించిన సిట్
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

Kurichedu Sanitizer Case Update : ప్రకాశం జిల్లా కురిచేడు, పామూరులో శానిటైజర్ తాగి 16 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించిన సిట్...

Kurichedu Sanitizer Case Update : ప్రకాశం జిల్లా కురిచేడు, పామూరులో శానిటైజర్ తాగి 16 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించిన సిట్ అధికారులు చేసిన విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. శానిటైజర్ తాగి చనిపోయిన వారు ఆ శానిటైజర్ ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే విషయవపై పోలీసులు అలాగే సిట్ అధికారులు తీగ లాగి పెద్ద డొంకను బయటికి తీసారు. ఈ విధంగా కుర్చేడ్ శానిటైజర్ మృతుల ఘటనను సిట్ చేదించింది. అయితే ఈ కేసులో సిట్ కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 'పర్ఫెక్ట్‌' యజమాని, ముడిసరుకును సరఫరా చేసిన ఇద్దరు మార్వాడీలు మరో ఇద్దరు డిస్టీబ్యూటర్స్ ఉన్నారు. అదుపులోకి తీసుకన్న నిందితులను సిట్ హైదరాబాద్‌ నుంచి నిన్న ఉదయం కురిచేడుకు తీసుకువచ్చారు. కాగా వారిని ఈ రోజు మీడియా ముందు హాజరుపరిచే అవకాశం ఉంది.

హైదరాబాద్‌లోని జీడిమెట్లకు చెందిన ఫర్ఫెక్ట్‌ శానిటైజర్‌ కంపెనీ యజమాని శ్రీనివాస్‌ మూడో తరగతి మాత్రమే చదివి స్ధానికంగా పర్ఫెక్ట్‌ కిరాణా మర్చంట్స్‌ పేరుతో గృహావసరాలకు ఉపయోగపడే దుకాణాన్ని నడిపినట్లు సిట్ అధికారులు గుర్తించారు. కాగా అతను లాక్‌డౌన్‌ సమయంలో శానిటైజర్లు, మాస్క్‌లు అమ్మకాలు చేపట్టాడు. కరోనా నేపథ్యంలో వ్యాపారం బాగుండడంతో యూట్యూబ్‌లో శానిటైజర్ ఫార్ములా విధానంను నిర్వహకుడు ఆచరణలో పెట్టాడు. ఎలాగయినా శానిటైజర్ ను తయారు చేయాలనుకున్నాడు. అయితే శానిటైజర్ తయారీలో ల్యాబ్‌ టెక్నీషియన్లు, అనుమతుల నిభందనలకు బేఖాతరు చేసారు. శానిటైజర్‌ తయారీలో ఇథైల్‌ ఆల్కహాల్‌తో పాటు మిథైల్‌ క్లోరైడ్‌ను కూడా వినియోగించడంవల్లే కుర్చేడు ఘటనలో 16మంది మృత్యువుకు కారకుడయినట్లు సిట్ బృంద అధికారుల నిర్ధారణ చేసారు. అయితే ఈ శానిటైజర్ ను అన్ని మెడికల్ షాపులకు కాకుండా కురిచేడులోని కొన్ని మెడికల్‌ షాపులకు మాత్రమే సరఫరా చేసినట్లు సిట్ సేకరించిన రికార్డుల్లో తెలిసింది. ఈ శానిటైజర్లను జిల్లాలో పర్ఫెక్ట్‌ కంపెనీ శానిటైజర్‌ గా దర్శికి చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్ను ఎంపిక చేసి స్థానికంగా అమ్మకాలు సాగించినట్లు విచారణలో వెల్లడిచేసారు. ప్రస్తుతం దర్శి డిస్టీబ్యూటర్స్ కోసం గాలిస్తున్న సిట్ అధికారులు తెలిపారు.




Show Full Article
Print Article
Next Story
More Stories