logo

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్
Highlights

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న(శుక్రవారం) ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న(శుక్రవారం) ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 'మనం ఇక్కడ మతాలుగా, కులాలుగా విడిపోయి కొట్టుకుంటున్నాం.. కానీ తెలంగాణలో ఆంధ్రవాళ్లంటే అలుసు.. కుల వర్గ భేదాలు లేకుండా మన వాళ్లను కొడుతున్నారు' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో పవన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు కొందరు.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. పవన్‌ వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని అన్నారు. దేశంలోని 29 రాష్ట్రాల ప్రజలు తెలంగాణలో నివసిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అన్ని రాష్ట్రాల వాళ్లు తెలంగాణాలో చాలా ప్రశాంతంగా జీవిస్తున్నారు. కొంతమంది కావాలనే పనిగట్టుకుని దుష్ప్రచారాలు ప్రసారం చేస్తున్నారు' అని ట్వీట్‌ చేశారు.


లైవ్ టీవి


Share it
Top