కృష్ణానది పరివాహక ప్రాజెక్టుల్లో నీటి నిల్వ ఎంత ఉందంటే..

కృష్ణానది పరివాహక ప్రాజెక్టుల్లో నీటి నిల్వ ఎంత ఉందంటే..
x
Highlights

నెల రోజులుగా మహారాష్ట్రలోని పడమటి కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ ఉద్ధృతంగా ప్రవహించింది. దీంతో కృష్ణానది పరివాహకమైన కర్ణాటకలోని...

నెల రోజులుగా మహారాష్ట్రలోని పడమటి కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ ఉద్ధృతంగా ప్రవహించింది. దీంతో కృష్ణానది పరివాహకమైన కర్ణాటకలోని నారాయణపూర్‌, ఆల్మట్టి డ్యామ్ లు పూర్తిగా నిండి దిగువన ఉన్న జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు నిండు కుండను తలపిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తోన్న వరదతో జూరాల పూర్తిగా నిండిపోయింది. ప్రస్తుతం అక్కడ 11 టీఎంసీలు గాను 10 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. శ్రీశైలం రిజర్వాయర్ లోకి వరదనీరు పోటెత్తడంతో ప్రాజెక్టు పది గేట్లను ఎత్తేశారు. 885 అడగుల గరిష్ట నీటి మట్టానికి గాను... ప్రస్తుతం 882 అడుగుల మేర నీటిమట్టం ఉంది. 215 టీఎంసీలకు గానీ.... 201 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాంలోకి 4లక్షల 21 వేల 869 క్యూసెక్కులు ఇన్ ఫ్లో వస్తుండగా... అవుట్‌ ఫ్లో 5 లక్షల 67 వేల 168 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు అధికారులు.

దీంతో నాగార్జున సాగర్ లో కూడా నీరు నిల్వ గరిష్ట స్థాయికి చేరుకుంది. నీటి నిల్వ 315 టీఎంసీలు గాను ప్రస్తుతం 302 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. ఇక వరద ప్రవాహాన్ని అంచనా వేసిన అధికారులు శనివారం గేట్లు మొత్తం ఎత్తారు. దీంతో దిగువన ఉన్న పులిచింతల ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తిగా నిండింది. 45 టీఎంసీల సామర్ధ్యం ఉన్న పులిచింతలలో ప్రస్తుతం 40 టీఎంసీలకు పైగా నీరు అందుబాటులో ఉంది. ఇటు ప్రకాశం బ్యారేజిలో కూడా 4 టీఎంసీల నీరు ఉంది. అటు హోస్పేట్‌‌లోని తుంగభద్ర డ్యాం పూర్తిగా నిండిపోయింది. డ్యాం గరిష్ట స్థాయి నీటి మట్టం 1633 అడుగులు ఉంది. డ్యాంలోకి 80 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో.. అధికారులు 20 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యాంలో ఇన్‌ఫ్లో తగ్గిపోవడంతో.. తుంగభద్రనదిలో ఉద్ధృతి కూడా తగ్గిపోయింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories