ఎన్నికల వేళ టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత..

ఎన్నికల వేళ టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత..
x
Highlights

ఎన్నికల వేళ టీడీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ శాసనసభ్యుడు టీవీ రామారావు జగన్ సమక్షంలో...

ఎన్నికల వేళ టీడీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ శాసనసభ్యుడు టీవీ రామారావు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు జగన్. కాగా కొవ్వూరు టిక్కెట్ ఆశించిన రామారావుకు నిరాశ ఎదురైంది. కొవ్వూరు టిక్కెట్ ను వంగలపూడి అనితకు కేటాయించారు చంద్రబాబు. 2009 లో కొవ్వూరు నుంచి గెలిచిన రామారావుకు 2014 సీటు దక్కలేదు.

మంత్రి జవహర్ ఇక్కడినుంచి పోటీ చేసి గెలిచారు. అయితే ఆయనపై కార్యకర్తల్లో వ్యతిరేకత పెరగడంతో ఆయనను కృష్ణా జిల్లా తిరువూరు నుంచి పోటీ చేయలని చంద్రబాబు ఆదేశించారు. కొవ్వూరును పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఉన్న అనితకు కేటాయించారు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రామారావు పచ్చ చొక్కా విప్పి నల్ల చొక్కా ధరించి నిరసన తెలిపారు. ఇవాళ(గురువారం) జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories