ఏంది రెడ్డే ఇట్లా సేస్తివి..

ఏంది రెడ్డే ఇట్లా సేస్తివి..
x
Highlights

కోట్ల అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే కోట్ల అన్న రీతిలో కర్నూల్ లో కోట్ల కుటుంబం రాజకీయాలు నడిపించింది. దశాబ్దలుగా ఆ కుటుంబం వెంటే జిల్లా ప్రజలు...

కోట్ల అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే కోట్ల అన్న రీతిలో కర్నూల్ లో కోట్ల కుటుంబం రాజకీయాలు నడిపించింది. దశాబ్దలుగా ఆ కుటుంబం వెంటే జిల్లా ప్రజలు నడిచారు. వారు చెప్పిందే వేదం, చేసిందే రాజకీయం. ఆ కుటుంబాన్ని నమ్ముకుని కొన్ని వందల కుటుంబాలు రాజకీయాలను నడిపించాయి. అయితే నాలుగున్నరేళ్ల కిందటి వరకు ఈ పంధా కొనసాగింది. రాష్ట్ర విభజన వారికి తీరని నష్టాన్ని మిగిల్చింది. కాంగ్రెస్ ను కోలుకోలేని దెబ్బతీసింది. దీంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. చాలా మంది లీడర్లు ఎవరిదారి వారు చూసుకున్నారు. ఈ క్రమంలో కోట్ల కుటుంబం కాస్త వెనకబడింది. ఇటు నాలుగున్నరేళ్లుగా కాంగ్రెస్ లో ఇమడలేక అటు వేరే పార్టీలో చేరలేక సతమతమైంది. ఈ క్రమంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే భవిశ్యత్ ప్రశ్నార్ధకమే అన్న నిర్ణయానికి వచ్చి. పార్టీ మారడానికి సిద్ధమైంది. దాంతో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఆయన భార్య సుజాతమ్మ టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అమరావతిలో కలిసి పార్టీలో చేరికపై చర్చించారు. చంద్రబాబు కూడా కోట్ల కుటుంబం టీడీపీలో చేరుతుందని నేతలకు క్లారిటీ ఇచ్చేశారు. ఇంతలో ఏమైందో ఏమో జిల్లాలో సాగునీటి ప్రోజెక్టులు త్వరితగతిన పూర్తి చేస్తేనే టీడీపీలో చేరతాము, అంతేకాకుండా టీడీపీలో చేరడం కేవలం మీడియా సృష్టేనని సూర్యప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారట..

దాంతో నేతలకు మతిపోయింది. పార్టీలో చేరేందుకు చర్చించడానికని వెళ్లి ఇలా మాట్లాడుతున్నారేంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తోందట కోట్ల క్యాడర్. దాంతో కన్ఫ్యూషన్ ఏర్పడింది. ఇంతకీ పెద్దాయన కుటుంబం పార్టీ మార్పు ఉంటుందా లేదా అన్న చర్చ మొదలైంది. అయితే వాస్తవానికి టీడీపీలో చేరబోతున్న కోట్ల కుటుంబానికి కర్నూల్ ఎంపీ తోపాటూగా డోన్, పాణ్యం అసెంబ్లీ టిక్కెట్లు కావాలని పట్టుబట్టిందని.. ఎంపీగా సూర్యప్రకాష్ రెడ్డి, డోన్ నుంచి తన భార్య సుజాతమ్మ, పాణ్యం నుంచి కుమారుడు రాఘవేందర్ రెడ్డికి టిక్కెట్లు అడుగుతున్నారట. అంతేకాకుండా జిల్లాలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చెయ్యాలనే కండీషన్ కూడా పెట్టారట. ఇది చేస్తేనే కోట్ల కుటుంబానికి పూర్వ వైభవం వస్తుంది, అది టీడీపీకి బాగా ఉపయోగపడుతుందని చెప్పారట. అయితే ప్రాజెక్ట్ ల సంగతి అటుంచితే ఒకే కుటుంబంలో ముగ్గురికి టిక్కెట్లు ఇవ్వడమంటే వేరే నేతలు ప్రశ్నించే అవకాశముంది. అందునా దశాబ్దాలుగా కోట్ల కుటుంబంతో రాజకీయ వైరం ఉన్న కెఇ కుటుంబం ఇందుకు ససేమీరా అంటోందట. దాంతో ఆలోచించుకుని చెబుతానని చంద్రబాబు సూర్యప్రకాష్ రెడ్డికి చెప్పారట. ఈ కారణంగానే కోట్ల కుటుంబం టీడీపీలో చేరడం వాయిదా పడిందనే వాదన వినబడుతోంది. మరోవైపు సూర్యప్రకాష్ రెడ్డి భార్య సుజాతమ్మ కుమారుడు రాఘవేందర్ రెడ్డి కి పార్టీ మారడం ఇష్టం లేదన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కోట్ల కుటుంబానికి చంద్రబాబు ఒకే చెబుతారా లేక నో చెబుతారో అన్నది కొద్ది రోజుల్లో తేలనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories