ఎట్టకేలకు సంచలన నిర్ణయం తీసుకున్న కోట్ల

ఎట్టకేలకు సంచలన నిర్ణయం తీసుకున్న కోట్ల
x
Highlights

కర్నూలు జిల్లా రాజకీయ ముఖచిత్రం మారబోతోంది. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి ఎట్టకేలకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ అధినేత...

కర్నూలు జిల్లా రాజకీయ ముఖచిత్రం మారబోతోంది. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి ఎట్టకేలకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కలిసిన కోట్ల ఆ పార్టీలో చేరతారని.. కార్యకర్తలు అడ్డు చెప్పడంతో వైసీపీలోకి వెళతారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి పులుస్టాప్ పడింది. కోట్ల కుటుంబం ఈనెల 28న తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం సిద్ధం చేసుకుంది. కర్నూలు జిల్లా కోడుమూరులో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన కుటుంబ సమేతంగా టీడీపీలో చేరనున్నారు. దీంతో కోట్ల చేరికకు జిల్లా టీడీపీ యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది.

కాగా కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డికి కర్నూలు లోక్‌సభ స్థానంతో పాటు సతీమణి సుజాతమ్మకు డోన్‌ లేదా ఆలూరు, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకదాన్ని కేటాయించే అవకాశముంది. కోట్ల కుటుంబం మాత్రం డోన్ పైనే ద్రుష్టి పెట్టింది. ఇక మంత్రి కెఇ కృష్ణమూర్తి ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో డోన్ ను వదులుకునేది లేదని తెగేసి చెబుతున్నారు. ఇక కోట్ల కుమారుడు రాఘవేంద్రరెడ్డికి ఎమ్మెల్సీ పదవి లేదా కర్నూల్ మేయర్ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories