వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించిన కోట్ల..

వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించిన కోట్ల..
x
Highlights

కర్నూల్ లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సోదరుడు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి వైసీపీలో చేరడానికి...

కర్నూల్ లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సోదరుడు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఆదివారం తన మద్దతుదారులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ముందుగా మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్‌ నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వారంతా వైసీపీలో చేరాలని హర్షవర్ధన్ రెడ్డికి సూచించారు.

దాంతో ఆయన ఫిబ్రవరి 6వతేదీన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. కాగా సూర్యప్రకాష్ రెడ్డి కూడా కాంగ్రెస్ ను వీడటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నా.. ఆయన సతీమణి సుజాతమ్మ కుమారుడు రాఘవేందర్ రెడ్డి మాత్రం వైసీపీలో చేరాలని పట్టుబడుతున్నారు. దీనిపై సూర్యప్రకాష్ రెడ్డి తర్జనభర్జనలో ఉన్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories