నేడు టీడీపీలోకి కోట్ల కుటుంబం.. మరో మాజీ ఎమ్మెల్యే కూడా..

నేడు టీడీపీలోకి కోట్ల కుటుంబం.. మరో మాజీ ఎమ్మెల్యే కూడా..
x
Highlights

దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన కోట్ల కుటుంబం నేడు టీడీపీలో చేరనుంది. మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆయన సతీమణి మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ,...

దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన కోట్ల కుటుంబం నేడు టీడీపీలో చేరనుంది. మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆయన సతీమణి మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ, కుమారుడు రాఘవేందర్ రెడ్డి శనివారం తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కోడుమూరులో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు సమక్షంలో కోట్ల టీడీపీలో చేరనున్నారు.

వారితోపాటు కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్‌ తదితరులు పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. పశ్చిమ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపితే టీడీపీలో చేరుతానన్నారు కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి. దీంతో ఇవాళ సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్ట్‌లుకు శ్రీకారం చుడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగిన సూర్యప్రకాష్ రెడ్డి ఇటీవలనే ఆ పార్టీకి రాజీనామా చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories