Kotappakonda: తొలి ఏకాదశి పర్వదినాన భక్తులతో కిటకిటలాడుతున్న కోటప్పకొండ

Kotappakonda is Crowded with Devotees on the First day of Ekadashi
x

Kotappakonda: తొలి ఏకాదశి పర్వదినాన భక్తులతో కిటకిటలాడుతున్న కోటప్పకొండ

Highlights

Kotappakonda: శ్రీత్రికోటేశ్వర సన్నీధిలో భారీగా భక్తులరద్దీ

Kotappakonda: ఏకాదశి పర్వదిన సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ శ్రీత్రికోటేశ్వర సన్నీధిలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీ త్రికోటేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు ఘనంగా జరిగాయి. తెల్లవారు జామునుంచే భక్తులు వేలాదిగా కొండకు తరలి వచ్చి స్వామిని దర్శించుకొని ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. అలయ వద్ద భక్తులు పొంగళ్ళు చేసి స్వామికి సమర్పించారు. ఆనందవల్లి అమ్మవారి దర్శనం అనంతరం భక్తులు సోపాన మార్గంలో మెట్ల పూజలు నిర్వహించారు.

వినాయకస్వామి, ధ్యాన శివుడు విగ్రహాల వద్ద, నాగేంద్రుని పుట్ట వద్ద భక్తులు పూజలు చేశారు. ఆలయ ఈవో G.శ్రీనివాసురెడ్డి, పాలక మండలి సభ్యులు ఏర్పాట్లును పర్వవేక్షించారు. స్వామి దర్శనం అనంతరం భక్తులు పర్యాటక కేంద్రాన్ని సందర్శించారు. ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories