అమెరికాలో పెట్టుబడిదారులతో సమావేశమైన వైసీపీ ఎంపీ.. అనుకూలంగా AUSIB

అమెరికాలో పెట్టుబడిదారులతో సమావేశమైన వైసీపీ ఎంపీ.. అనుకూలంగా AUSIB
x
Highlights

ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపి కోటగిరి శ్రీధర్, ఉత్తర అమెరికాలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పాండుగయల...

ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపి కోటగిరి శ్రీధర్, ఉత్తర అమెరికాలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పాండుగయల రత్నాకర్ పనిచేస్తున్నారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు పారిశ్రామిక, వ్యాపారవేత్తల మధ్య సంబంధాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో అలయన్స్ ఫర్ యుఎస్-ఇండియా బిజినెస్ (AUSIB) ప్రతినిధి బృందాన్ని కలిసింది వీరి బృందం.

ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ లో పుష్కలంగా అవకాశాలు ఉన్నట్టు AUSIB ప్రతినిధులకు శ్రీధర్, రత్నాకర్.. వివరించారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ, స్మార్ట్ సిటీ అభివృద్ధిలో పెట్టుబడుల అవకాశాలను శ్రీధర్ వివరంగా వివరించారు. AUSIB వ్యవస్థాపక అధ్యక్షుడు సంజయ్ పూరి మాట్లాడుతూ, AP లో వ్యాపార అవకాశాలకు భారీ అవకాశాలు ఉన్నాయన్నారు. అమెరికా పారిశ్రామికవేత్తలు మరియు పెట్టుబడిదారులతో భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పటంలో ఉంచుతుందని.. పారిశ్రామిక రంగంలో రాష్ట్రాన్ని మరింత ఎత్తుకు తీసుకువెళుతుందని అన్నారు. "వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం మరియు రాష్ట్రంలోని వ్యాపార సంస్థలతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు ఆయన చెప్పారు.

విజయవాడ, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నంలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. వ్యవసాయం, మత్స్య, స్మార్ట్ సిటీలు, ఆరోగ్య సంరక్షణ మరియు పునరుత్పాదక ఇంధన రంగాల వంటి ప్రాధాన్యత రంగాలలో అమెరికా పెట్టుబడిదారులకు పెట్టుబడుల అవకాశాలను రత్నాకర్ వివరించారు.

AUSIB చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మనీష్ చౌహాన్ టెక్నాలజీ, రక్షణ ఎగుమతులు, వాణిజ్య వెంచర్లు, మానవరహిత వాహనాలు మరియు విద్యా రంగాలలో లభించే అవకాశాల గురించి మాట్లాడారు. AUSIB సీనియర్ కన్సల్టెంట్ జెరెమీ స్పాల్డింగ్ మాట్లాడుతూ, ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారతదేశం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని భారతదేశం ఇప్పటికే అత్యంత సంభావ్య మార్కెట్ ప్రదేశంగా అవతరించింద ఆమె చెప్పారు.

AUSIB ద్వారా సంభావ్య ప్రాంతాలను గుర్తించడం ద్వారా పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడానికి దేశంలోని ఇతర రాష్ట్రాలకు రాష్ట్రాన్ని ఒక ప్రముఖ ఉదాహరణగా మార్చడానికి రోడ్ మ్యాప్ రూపొందించేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories