కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని ఐదుగురు మృతి.. ట్రాక్‌ దాడుతుండగా ప్రమాదం...

Konark Express Hits Passenger who Crossing Track in Ganguvari Singadam Srikakulam District | Live News
x

కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని ఐదుగురు మృతి.. ట్రాక్‌ దాడుతుండగా ప్రమాదం...

Highlights

Srikakulam: మృతుల సంఖ్య పెరిగే అవకాశం...

Srikakulam: శ్రీకాకుళం జిల్లా జి సిగడాం మండలంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొని ఏడుగురు చనిపోయారు. బాతువ రైల్వే గేట్ సమీపం వద్ద గౌతమీ ఎక్స్‌ప్రెస్ ఆగింది. దీంతో ప్రయాణికులు కిందకు దిగారు. ఇంతలో ఎదురుగా వస్తున్న కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు విడిచారు. మరికొంతమందికి గాయాలు అయ్యాయి. సికింద్రాబాద్ నుంచి గౌహతి వెళ్తున్న సూపర్ ఫాస్ట్ ట్రైన్ లో సడన్‌గా పొగలు వచ్చాయి.

గమనించిన ప్రయాణికులు చైన్ లాగడంతో ట్రైన్ చీపురుపల్లి బాతువ మధ్య నిలిచిపోయింది. అయితే జనరల్ బోగీలో ఉన్న కొంతమంది ప్రయాణికులు గాలి కోసం దిగి పట్టాలపై ఉన్నారు. ఇదే సందర్భంలో భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలు వేగంగా వచ్చి పట్టాలపై ఉన్న ప్రయాణికులను ఢీకొట్టింది. మృత దేహాలను గుర్తించి ఆస్పత్రికి తరలింసాకగ. మరికొన్ని మృతదేహాలు చిందరవందరగా పడడంతో వాటిని అధికారులు సేకరిస్తున్నారు.

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రెవెన్యూ పోలీసు, రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుల వివరాలను సేకరించారు. శ్రీకాకుళం జిల్లాలో రైలు ఢీకొని పలువురు మరణించిన ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మంచి వైద్యసేవలు అందేలా చూడాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. ఘటనకు సంబంధించిన ప్రాథమిక వివరాలను అధికారులు సీఎంకు అందించారు. మృతుల కుటుంబాలకు అన్నిరకాలుగా సహాయసహకారాలు అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories